Telangana: పంతులమ్మగా మారిన కలెక్టరమ్మ... కారణం?
సాక్షి ఎడ్యుకేషన్: అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ టీచరమ్మగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. గురువారం మండలంలోని ఇటిక్యాల, తిమ్మాపూర్ గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటిక్యాలలో డంపుయార్డులో తయారు చేస్తున్న వర్మీకంపోస్టును చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పార్కు ఫొటో సందర్శనను చూసి ఫిదా అయ్యారు. సర్పంచ్ చంద్రశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
తిమ్మాపూర్‌లో పల్లెపార్కును పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చంద్రయాన్–3పై అవగాహన కల్పించి స్వయంగా పాఠాలు బోధించారు. మరుగుదోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి బాలేషంగౌడ్, డిఎల్‌పీఓ వేదావతి, సర్పంచ్‌లు, లక్ష్మీరమేష్, చంద్రశేఖర్, ఎంపిడిఓ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రమేష్, కావ్యనర్సింలు, కార్యదర్శులు సత్యం, వేణు, ఈజీఎస్ సిబ్బంది కరుణకర్‌రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.