డైట్‌ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలి

నెల్లిమర్ల: డీఈడీ–2018 లో ఫెయిలైన ప్రభుత్వ, ప్రైవేట్‌ డైట్‌ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాలని డైట్‌ ప్రిన్సిపాల్‌ జి.పగడాలమ్మ జూలై 24న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

డీఈడీ–2018 మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు వచ్చేనెల 4లోగా చెల్లించాలని, ఆలస్య రుసుముతో వచ్చేనెల 20వ తేదీలోగా చెల్లించాలని పేర్కొన్నారు.

అలాగే ఒకసబ్జెక్టుకు రూ.100, రెండు సబ్జెక్టులకు రూ.120, మూడు సబ్జెక్టులకు రూ.140, నాలుగు సబ్జెక్టులకు రూ.150 పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు.

చదవండి:

Holidays: తల్లిదండ్రులతో గడిపేందుకు రెండు రోజులు సెలవు

Tomorrow Holiday news: రేపు విద్యా సంస్థలు బంద్‌ ఎందుకంటే..

#Tags