TS DSC 2024 Results : టీఎస్ డీఎస్సీ -2024 ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..! సెప్టెంబరు 5వ తేదీలోపు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మెగా డీఎస్సీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ప‌రీక్ష నిర్వ‌హించింది.

అలాగే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రాథ‌మిక కీ ని కూడా విడుద‌ల చేసింది. ఈ కీ పై అభ్యంతరాల స్వీకరణకు.. ఆగస్టు 20వ తేదీతో ఈ గడువు కూడా పూర్తి కానుంది. 

ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం..
తెలంగాణ ప్ర‌భుత్వం మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి స్వీకారం చుట్టింది. ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు.. 182 పీఈటీలు.. 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి. ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

➤☛ TS TET 2024 ALERT : టెట్ రాసిన అభ్య‌ర్థులు అల‌ర్ట్‌.. అలాగే డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు కూడా..

సెప్టెంబరు 5వ తేదీలోపు..
ఈ సారి టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి సెప్టెంబరు 5వ తేదీన‌ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కసరత్తులు మొదలు పెట్టారట.

➤☛ TS DSC 2024 Key Released : టీఎస్ డీఎస్సీ-2024 'కీ' విడుద‌ల‌..! ఈ ప్ర‌శ్న‌లకు మాత్రం..

అతి త్వరలో సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసి..
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల విషయంలో వేగంగా అడుగులేస్తోంది. అతి త్వరలో సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసి నియామక పత్రాలు అందజేయాలనే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ డీఎస్సీ-2024 ఫ‌లితాల‌కు సంబంధించి మరో కీలక విషయం బయటకొచ్చింది. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్లను నియమించాలనే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ‌ సర్కార్.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ పూర్తయిన వెంటనే ఫైనల్ కీని రిలీజ్ చేసి.., అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టును ప్రకటించనున్నారని సమాచారం. ఈ లెక్కన చూస్తే ఆగస్టు మూడు లేదా నాలుగో వారంలోనే ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫ‌లితాలు విడుద‌లైన వెంట‌నే.. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఆ వెంటనే నియామక పత్రాలు  ఇవ్వ‌నున్నారు.

☛➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

#Tags