TS Govt To Release Another Dsc Notification: త్వరలోనే మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్.. ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో మ‌రోసారి డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించి ప్రాథమిక కీని విడుదల చేశారు. సెప్టెంబరు మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకుంటున్నారు.

Job Interviews: వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఆ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి!

అనంతరం అక్టోబరు నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవి కాగానే కొత్త డీఎస్సీని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డిసెంబరు లేదా జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసి, జూన్‌, జూలైలోపు నియామకాలను పూర్తి చేసేలా ప్రణాళిక ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఆ లోపు టెట్‌ను కూడా నిర్వహించే అవకాశం ఉంది.

కొత్త డీఎస్సీ కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవచ్చనే అంశంపై అధికారులు జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు.పాఠశాలల సంఖ్య, అందులోని విద్యార్థులు, ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన డీఎస్సీ ద్వారా నియమితులయ్యే ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటాయన్న దానిపై అధ్యయనం చేస్తున్నారు.

TS RTC Jobs 2024 Notification : 2 వారాల్లో ఆర్టీసీలో 3035 ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్‌.. మరో 4 వేల ఉద్యోగాల‌కు కూడా..

కాగా, పాఠశాలల్లో ఖాళీలు ఉన్నా.. వాటిని భర్తీ చేయడంలో సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. దాంతో చాలాచోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నా.. అందుకుతగ్గట్లుగా విద్యార్థులు లేరు. ఇలాంటి సందర్భంలో క్రమబద్ధీకరణను అమలు చేయాలి. ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం జరగడం లేదు. ఈ పనిచేసిన తర్వాతనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటే ప్రయోజనం అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

#Tags