Asian Games 2023 Roller skating: రోలర్‌ స్కేటింగ్‌లో భారతకు 2 కాంస్యాలు

మ‌హిళ‌ల‌, పురుషుల‌ రోలర్‌ స్కేటింగ్‌లో భారతకు 2 కాంస్య ప‌త‌కాలు ల‌భించాయి.
Asian Games 2023 Roller skating

భారత స్కేటింగ్‌ రిలే టీమ్‌ కాంస్య పతకం సాధించింది. వుమెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీ.లో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్‌, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నారు. సమన్వయలోపానికి తావులేకుండా సమష్టిగా రాణించి 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు.

Asain Games 2023 Squash: స్క్వాష్‌ పురుషుల ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం

రోలర్‌ స్కేటింగ్‌లో అబ్బాయిలు కూడా అదరగొట్టారు. మెన్స్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ 3000మీ. రిలే టీమ్‌ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. ఆర్యన్‌ పాల్‌, ఆనంద్‌ కుమార్‌, సిద్ధాంత్‌, విక్రమ్‌ కలిసి భారత్‌కు మరో పతకం అందించారు.

15 medals in a day: ఓకే రోజు పదిహేను పతకాలు

#Tags