Skip to main content

National Games: జాతీయ క్రీడల్లో స్వప్నిల్‌కు కాంస్యం.. దీపిక కుమారికి పసిడి

జాతీయ క్రీడల్లో ఒలింపిక్‌ పతక విజేత స్వప్నిల్‌ కుసాలె కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.
Swapnil Kusale wins Bronze Medal in National Games

షూటింగ్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్‌ విభాగంలో మహారాష్ట్ర షూటర్‌ స్వప్నిల్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) తరఫున బరిలోకి దిగిన 25 ఏళ్ల నీరజ్‌ కుమార్‌ 464.1 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. 

మధ్యప్రదేశ్‌కు చెందిన ఐశ్వరి ప్రతాప్‌ సింగ్ రజత పతకం దక్కించుకోగా, భార‌త‌ దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్ కాంస్యం గెలుచుకున్నాడు. 

మరోవైపు.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సురుచి సింగ్‌–ప్రమోద్‌ (హరియాణా) 17–7 పాయింట్ల తేడాతో అంజలి షెఖావత్‌–ఉమేశ్‌ చౌదరీ (రాజస్తాన్‌)పై గెలిచి పసిడి ఖాతాలో వేసుకుంది. 

National Games: జాతీయ క్రీడల్లో తెలంగాణకు తొలి స్వర్ణం

➤ రాహి సర్ణోబత్‌–ప్రణవ్‌ అరవింద్‌ పాటిల్‌ (మహారాష్ట్ర) జట్టు కాంస్యం గెలుచుకుంది. 

➤ భారత టాప్‌ ఆర్చర్‌గా ఉన్న దీపిక కుమారి పసిడిని అందుకుంది. 

పురుషుల విభాగంలో.. నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సీనియర్‌ ఆర్చర్‌ తరుణ్‌దీప్‌ రాయ్‌ను ఓడించిన 18 ఏళ్ల బెంగాల్‌ ఆర్చర్‌ జుయెల్‌ సర్కార్‌ జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. మరో వైపు బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహైన్, ఆరు సార్లు ఆసియా చాంపియన్‌ శివ థాపా విజయాలు సాధించారు. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా తిరుగులేని ప్రదర్శన కనబర్చగా..  పురుషుల 64 కేజీల విభాగంలో శివ థాపా (అసోం) సత్తాచాటాడు.

Karnataka Swimmers: జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లకు.. చెరో తొమ్మిది పసిడి పతకాలు

Published date : 08 Feb 2025 09:16AM

Photo Stories