Asian Games 2023: ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత్‌కు ఐదు పతకాలు

ఆసియా క్రీడల్లో తొలి రోజు భారత క్రీడాకారులు మెరిపించారు. షూటింగ్‌లో రెండు, రోయింగ్‌లో మూడు పతకాలతో రాణించారు.
Asian Games 2023

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగం టీమ్‌ ఈవెంట్‌లో రమితా జిందాల్, మెహులీ ఘోష్, ఆశి చౌక్సీలతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. క్వాలిఫయింగ్‌లో భారత బృందం 1886 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. హాన్‌ జియావు, యుటింగ్‌ హువాంగ్, జిలిన్‌ వాంగ్‌లతో కూడిన చైనా జట్టు 1896.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది.

World Cup Shooting Tournament: షూటర్‌ ఇలవేనిల్‌కు బంగారు పతకం

గాన్‌హుయగ్, యసుజెన్, నరన్‌తుయాలతో కూడిన మంగోలియా జట్టు 1880 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. ఫైనల్లో రమిత 230.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకోగా... మెహులీ 208.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. యుటింగ్‌ హువాంగ్‌ (252.7 పాయింట్లు) స్వర్ణం, హాన్‌ జియావు (251.3 పాయింట్లు) రజతం గెల్చుకున్నారు. 
రోయింగ్‌లో పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో అర్జున్‌ లాల్‌ జాట్‌–అరవింద్‌ సింగ్‌ ద్వయం రజత పతకంతో బోణీ కొట్టింది. భారత జోడీ 6ని:28.18 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. జున్‌జీ ఫాన్‌–మన్‌ సున్‌ (చైనా; 6ని:23.42 సెకన్లు) జంట స్వర్ణ పతకం సాధించింది. పురుషుల పెయిర్‌ విభాగంలో బాబూలాల్‌ యాదవ్‌–లేఖ్‌ రామ్‌ జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.

ISSF Shooting World Cup: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో భార‌త్‌కు రజతం

ఫైనల్‌ రేసులో బాబూలాల్‌–లేఖ్‌ రామ్‌ జంట 6ని:50.41 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. అనంతరం పురుషుల కాక్స్‌డ్‌ ఎయిట్‌ ఈవెంట్‌లో భారత జట్టు రజతం గెల్చుకుంది. నీరజ్, నరేశ్‌ కల్వానియా, నితీశ్‌ కుమార్, చరణ్‌జీత్‌ సింగ్, జస్విందర్‌ సింగ్, భీమ్‌ సింగ్, పునీత్‌ కుమార్, ఆశిష్‌లతో కూడిన భారత జట్టు 5ని:43.01 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందింది. 

Archery World Cup Final 2023: ప్రపంచకప్ ఆర్చరీ ఫైనల్స్‌లో ప్రథమేశ్‌కు రజతం

#Tags