Nepal Currency Note: నేపాల్ కరెన్సీ నోటుపై వివాదాస్పద భూభాగాలు
Sakshi Education
నేపాల్ తాజా కరెన్సీ నోటుపై వివాదాస్పద భూభాగాలైన లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలతో కూడిన కొత్త పటం చోటుచేసుకోనుంది..
సాక్షి ఎడ్యుకేషన్: నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలైన లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలతో కూడిన కొత్త పటం చోటుచేసుకోనుంది.
Nuclear Bomb: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు.. అణుబాంబు హెచ్చరికలు!!
ఈ పరిణామంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కృత్రిమ విస్తరణతో కూడిన ఏకపక్ష చర్యగా పేర్కొంది. ఇది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. సిక్కిం, పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్...ఇలా అయిదు భారత రాష్ట్రాలతో నేపాల్ 1,850 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది.
Rita Sherpa: 29వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించిన వ్యక్తి ఎవరో తెలుసా..?
Published date : 14 May 2024 12:50PM