Skip to main content

Nuclear Bomb: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు.. అణుబాంబు హెచ్చరికలు!!

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Amid Tensions, Iran's Big Nuclear Bomb Warning To Israel

తమ దేశానికి ముప్పు ఉంటే అణుబాంబులు తయారు చేయడానికైనా వెనకాడబోమని ఇరాన్ మరోసారి హెచ్చరించింది. 

➣ ఇరాన్ సుప్రీ లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు కమల్ ఖరాజీ ఈ హెచ్చరిక చేశారు.
➣ ఇజ్రాయెల్ దాడుల ముప్పు కారణంగా ఇరాన్ తన అణు విధానాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
➣ ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.
➣ గాజాలో పాలస్తీన్లపై ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది.

 

Israel-Hamas war: కాల్పుల విరమణకు హమాస్‌ ఆమోదం!

➣ ఇరాన్‌కు సాంకేతికంగా అణుబాంబులను తయారు చేసే సామర్థ్యం ఉంది. అయితే, ప్రస్తుతం అలాంటి ప్రణాళికలు లేవని గతంలో చెప్పింది.
➣ ఇరాన్ 60% స్వచ్ఛతతో యురేనియంను శుద్ధి చేయగలదు. అణుబాంబులకు 90% స్వచ్ఛత అవసరం.

Published date : 13 May 2024 04:38PM

Photo Stories