AP CM Inaugurates Multiple Projects virtually: ఏపీలో ప‌లు ప్రాజెక్టులు వర్చువల్‌గా ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
AP CM Inaugurates Multiple Projects virtually

ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయో­జనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్‌ యూనిట్‌తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్‌కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్‌ లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. 

Krishnapatnam-Hyderabad Multi-product pipeline: కృష్ణపట్నం–హైదరాబాద్‌ల‌ మధ్య మల్టీ ప్రొడక్ట్‌ పైప్‌లైన్‌

పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ..

1. గ్రీన్‌ లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌

తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌. ఈ యూనిట్‌ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు.

2. ఎకో స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్‌ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు.

3. ఎవరెస్ట్‌ స్టీల్‌ బిల్డింగ్‌

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్‌ స్టీల్‌ బిల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపె­నీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 

4. శర్వాణి బయో ఫ్యూయల్‌

బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్‌ లిమిటెడ్‌ యూనిట్‌ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు.

5. నాగార్జున ఆగ్రో కెమికల్స్‌

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఏసీఎల్‌) యూనిట్‌. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్‌ ఆర్గానిక్‌ కెమికల్స్, ఫ్లోరైన్‌ ఆధారిత కెమికల్స్‌ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి. 

6. రవళి స్పినర్స్‌  

తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎస్‌పీఎల్‌) యూనిట్‌. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి.

7.యునైటెడ్‌ ఇండస్ట్రీస్‌ ఆటోమోటివ్‌

శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్‌ ఇండస్ట్రీస్‌ ఆటోమోటివ్‌ ప్లాస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ యూనిట్‌. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి.

NBAGR Recognition for AP Sheeps: ఆంధ్ర‌ప్ర‌దేశ్ గొర్రె జాతులకు ఎన్‌బీఏ జీఆర్ గుర్తింపు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో ఇవీ ప్రాజెక్టులు..

1.డీపీ చాక్లెట్స్‌

తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్‌ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్‌ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి.

2. పులివెందుల అరటి ప్రాసెసింగ్‌ క్లస్టర్‌

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్‌ క్లస్టర్‌లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్‌ ద్వారా బనానా పౌడర్, స్టెమ్‌ జ్యూస్, హానీ డిప్ప్‌డ్‌ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్‌తో ప్రయోజనం చేకూరుతుంది.

3. ఓరిల్‌ ఫుడ్స్‌

విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్‌ పుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఇన్‌స్టెంట్‌ వెజిటబుల్‌ చట్నీస్‌ తయారీ యూనిట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్‌. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం  కలిగిన ఈ యూ­నిట్‌ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం.

NITI Aayog's growth hub cities: నీతి ఆయోగ్‌ గ్రోత్‌ హబ్‌ నగరాల్లో విశాఖకు చోటు

#Tags