Skip to main content

NBAGR Recognition for AP Sheeps: ఆంధ్ర‌ప్ర‌దేశ్ గొర్రె జాతులకు ఎన్‌బీఏ జీఆర్ గుర్తింపు

శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ యానిమల్‌ జెనెటిక్‌ రిసోర్సెస్‌ (ఎన్‌బీఏ జీఆర్‌) గుర్తింపు లభించింది.
NBAGR Recognition for AP sheeps ,Genetic resources,,National Bureau of Animal Genetic Resources
NBAGR Recognition for AP sheeps

నాటు గొర్రెలుగా ముద్ర­పడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యా­లయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో రెండొంద­లకు పైగా గొర్రె జాతులను అధికారికంగా గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని గొర్రెల్లో జన్యు వైవిధ్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాగావళి గొర్రె(విజయనగరం నాటు గొర్రె)లతో పాటు పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల (కృష్ణ) గొర్రెలను అధికారికంగా గుర్తించాలన్న డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. ఏదైనా కొత్త జాతిని గుర్తించాలంటే వాటి బాహ్య, జన్యు లక్షణాల నిర్థారణ, జనాభా స్థితుగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా శ్రీవేంక­టేశ్వర పశువైద్య విశ్వ­విద్యా­లయానికి అనుబంధంగా ఉన్న మాచర్ల, గరివిడి పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు 15 ఏళ్లపా­టు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక సమర్పించాయి. 

NITI Aayog's growth hub cities: నీతి ఆయోగ్‌ గ్రోత్‌ హబ్‌ నగరాల్లో విశాఖకు చోటు

అధికారిక గుర్తింపుతో ప్రయోజనాలివీ

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రుణాలు పొందాలంటే గొర్రెల జాతులను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్రా, పల్నాడు, రాయల­సీమ ప్రాంతవాసులు తా­ము పెంచే జాతులను నాటు గొర్రెలుగా పేర్కొ­నా­ల్సి రావడంతో తగిన లబ్ధి, ఆశించిన ధర పొంద­లేకపోతున్నారు. ప్రస్తుతం వీటికి అధికారిక గుర్తింపు లభించడంతో వాటిని పెంచేవారు ఇకపై అన్ని రకాల లబ్ధి పొందగలరు. పునరుత్పత్తి కోసం ఉప­యోగించే పొట్టేళ్ల ధర ప్రస్తుతం రూ.30 వేలు కాగా గుర్తింపుతో రూ.45 వేలు పలికే అవకాశం ఉంది. ఆడ గొర్రెలకు ప్రస్తుతం రూ.10 వేలు లభిస్తుండగా.. ఇకపై రూ.15 వేల వరకు పలుకుతాయి.

AP GSDP: ఏపీ స్థూల ఉత్పత్తిలో భారీగా పెరుగుదల

కృష్ణ గొర్రెలకు వందేళ్ల చరిత్ర

ap sheeps

మాచర్ల గొర్రెల జన్మస్థలం కృష్ణా నది పరీవాహక ప్రాంతం కావడంతో వీటిని కృష్ణ గొర్రెలుగా పిలుస్తారు. నదికి ఇరువైపులా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఏపీలో 6.60 లక్షల సంపద ఉందని అంచనా. నెల్లూరు, ముజఫర్‌ నగర్‌ గొర్రెల కంటే అధిక బరువు కలిగి ఉంటాయి.
నలుపు, తెలుగు, గోధుమ రంగుల్లో ఉంటాయి. తల కుంభాకారంగా, చెవులు, తోక గొట్టాల వలె ఉంటాయి. కొమ్ములు తలకి సమాంతరంగా వుంటాయి. మొదటి ఈత 18–24 నెలలకు వస్తాయి. 20 శాతంపైగా కవలలకు జన్మనిస్తాయి.ప్రతి రెండేళ్లకు 3 పిల్లల చొప్పున ఏడేళ్ల జీవిత కాలంలో 6–8 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 53.25 కేజీలు, ఆడ గొర్రె 40 కేజీల వరకు పెరుగుతాయి. 

Geographical Identification Certificate: ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు సర్టిఫికెట్‌

యుద్ధాలు చేసిన గొర్రెలివి 

నాగావళి జాతి గొర్రెలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కళింగుల కాలంలో ఈ గొర్రెలను యుద్ధాలు, పందేలకు వినియోగించేవారని చెబుతుంటారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో సుమారు 9.90 లక్షల నాగావళి గొర్రెలు ఉన్నట్టు అంచనా. బూడిద, గోధుమ, తెలుపు మిశ్రమ వర్ణం కలిపి ఉంటాయి. తల పాము పడగ ఆకారం ఉంటుంది. కళ్ల చుట్టూ నల్లటి వలయం, నోరు, ఉదరం, కాళ్ల చివర భాగం నల్లగా, తోక సన్నగా, కాళ్లు, గిట్టలు బలంగా పొడవుగా ఉంటాయి.

ఏడేళ్ల పాటు జీవించే ఈ గొర్రెలు ఏడాదిన్నర నుంచి ప్రతి రెండేళ్లకు 6 పిల్లలకు జన్మనిస్తాయి. పొట్టేలు 2.5 అడుగులు ఎత్తు పెరిగితే.. ఆడ గొర్రెలు మగ గొర్రెల కంటే 2 అంగుళాల తక్కువ ఎత్తు ఉంటాయి. పొట్టేలు 42 కిలోలు, ఆడ గొర్రెలు 35 కిలోల వరకు బరువు పెరుగుతాయి. 12 నెలల వయసులోనే మంచి మాంసం దిగుబడి వస్తుంది. వీటి మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. పరాన్న జీవులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే రోగాలను తట్టుకునే శక్తి వీటికి ఉంది. వీటిలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.

GI Tag for Halwa: హల్వాకు భౌగోళిక గుర్తింపు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగులు

Published date : 22 Sep 2023 01:03PM

Photo Stories