New Hamas Chief: హమాస్ కొత్త చీఫ్‌గా యాహ్యా సిన్వర్
గాజా స్ట్రిప్‌లో పాలస్తీ నియన్ల హక్కుల కోసం పోరాడుతున్న తమకు నూతన సారథిగా యాహ్యాసిన్వర్ వ్యవహరిస్తారని హమాస్ ఆగస్టు 6వ తేదీ ప్రకటించింది.
గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ మెరుపుదాడికి సిన్వరే సూత్రధారి అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నాటి మెరుపుదాడిలో 1,200 మందిని చంపేసిన హమాస్ మిలిటెంట్లు.. 250 మంది ఇజ్రాయెల్ పౌరులను కిడ్నాప్‌చేసి బందీలుగా గాజా స్ట్రిప్‌కు తీసుకెళ్లింది.
ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అధికారిక కార్యక్రమంలో పాల్గొని అతిథి గ`హానికి విచ్చేసిన హమాస్ రాజకీయ విభాగ చీఫ్ ఇస్మాయెల్ హనియాను గదిలో బాంబు పెట్టి ఇజ్రామెల్ నిఘా దళాలు హతమార్చిన విషయం విదితమే. దీంతో హమాస్ తమ మరో సీనియర్ నేత అయిన యాహ్యాసిన్వర్‌ను చీఫ్‌గా ఎంపిక చేసింది. గతేడాది అక్టోబర్ 7వ తేదీ మెరుపుదాడి తర్వాత సిన్వర్ ఇంతవరకు బాహ్య ప్రంపచానికి కనిపించలేదు.
Israel Hamas war: ఇస్మాయిల్ హనియే హత్య వెనక ఉన్న మతిపోయే ప్లాన్!!
#Tags