One Nation, One Election: ఎన్నికలు.. రెండు దశలుగా అమలైన జమిలి

కోవింద్‌ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించింది.

‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ఏం చెప్పిందంటే.. 

➢ జమిలి ఎన్నికలను అమల్లోకి తెచ్చేందుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేయాలి. 
➢ తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. 
➢ అనంతరం 100 రోజుల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపేలా వ్యవస్థలను రూపొందించాలి. 

➢ సార్వత్రిక ఎన్నికలు జరిగి, కొత్తగా కొలువుదీరే లోక్‌సభ తొలిసారి సమావేశమయ్యే తేదీని ‘అపాయింటెడ్‌ డే’గా రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దాంతో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు నాంది పడుతుంది. 

➢ అపాయింటెడ్‌ డే తర్వాత ఏర్పడే అన్ని అసెంబ్లీల గడువూ లోక్‌సభతో పాటే ముగుస్తుంది. తదనంతరం లోక్‌సభ, అన్నీ అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. 

➢ లోక్‌సభలో ఏ పార్టీకీ మెజారిటీ రాకుండా హంగ్‌ ఏర్పడి, లేదా అవిశ్వాస తీర్మానం వంటివి నెగ్గి సభ రద్దయినా మళ్లీ ఎన్నికలు జరపాలి.  
➢ అలాంటి సందర్భంలో కొత్త సభ గడువు.. రద్దయిన సభలో మిగిలిన కాలావధి వరకు మాత్రమే ఉంటుంది. 

Jamili Elections: 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'.. హంగ్ వస్తే?

➢ అసెంబ్లీలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే హంగ్‌ తదితర కారణాలతో ఎన్నికలు జరిగి మధ్యలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీలు ఐదేళ్లు కొనసాగకుండా లోక్‌సభతో పాటే రద్దవుతాయి. 
➢ అన్ని ఎన్నికలకూ ఉమ్మడిగా ఒకే ఎలక్టోరల్‌ రోల్, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్‌) ఉపయోగించాలి.     

ఆమోదం ఈజీ కాదు.. 
జమిలి ఎన్నికలకు పార్లమెంటు ఆమోదముద్ర పొందడం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుకు అంతా ఈజీ కాబోదు. నవంబర్‌ గేమ్‌ అధికార కూటమికి అంత అనుకూలంగా లేదు. జమిలికి సంబంధించి కోవింద్‌ కమిటీ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. వాటికి ఆమోదం లభించాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అందుకు 543 మంది ఎంపీలున్న లోక్‌సభలో 362 మంది, 245 మంది ఎంపీలుండే రాజ్యసభలో 164 మంది మద్దతు అవసరం. 

కానీ ఎన్డీయే కూటమికి లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 113 మంది ఎంపీలే అన్నారు. అయితే కోవింద్‌ కమిటీ ముందు జమిలిని సమర్థించిన పార్టీలకున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య 271 మాత్రమే. దాన్ని వ్యతిరేకించిన 15 పార్టీలకు 205 మంది లోక్‌సభ సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది సభ్యుల బలముంది.

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా ఒడిఒడిగా అడుగులు... జ‌మిలి ఎన్నిక‌లు సాకార‌మ‌య్యేనా..?

జమిలిపై భిన్నాభిప్రాయాలు.. ఆచరణ సాధ్యమేనా? 
జమిలి.. ప్రస్తుతం దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న పదం. అయితే లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఏ మేరకు ఆచరణ సాధ్యమన్న దానిపై భిన్నాప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ వంటి నాలుగైదు అసెంబ్లీలకు మాత్రమే లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా అసెంబ్లీలకు విడిగా, వేర్వేరుగానే ఎన్నికలొస్తున్నాయి. వీటన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 

అందుకు పలు అసెంబ్లీలను గడువుకు ముందే రద్దు చేయడం, కొన్నింటిని పొడిగించడమో, లేదంటే గడువు తీరాక సుప్త చేతనావస్థలో ఉంచడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనన్న అభిప్రాయముంది. లేదంటే లోక్‌సభ కొత్తగా తొలిసారి కొలువుదీరిన తేదీని ‘అపాయింటెడ్‌ డే’గా ప్రకటించి, ఆ తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీల అన్నింటి గడువూ.. వాటి ఐదేళ్ల కాలపరిమితితో సంబంధం లేకుండా.. లోక్‌సభతో పాటే ముగిసే ప్రతిపాదనను అమలు చేయాలి.

ఇలా ఒకసారి చేస్తే సరిపోతుందని, ఇక అప్పటి నుంచి జమిలి ఎన్నికలే ఉంటాయని కోవింద్‌ కమిటీ పేర్కొంది. ఇందులో ఆచరణపరంగా ఎన్నో ఇబ్బందులున్నాయన్నది నిపుణుల మాట. అంతేగాక అసలు ఈ ప్రతిపాదన రాష్ట్రాల అధికారాల్లో అవాంఛిత జోక్యమే తప్ప మరోటి కాదని పలు పార్టీలు వాదిస్తున్నాయి. పైగా లోక్‌సభతో పాటే అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే జాతీయాంశాలే తెరపైకి వస్తాయని, రాష్ట్రాల్లోని స్థానికాంశాలు పక్కకు పోతాయని ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా డీఎంకే వంటి పలు పార్టీలు జమిలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Telangana History: తెలంగాణది చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం.. దీని గురించి తెలుసుకోండి..

ఆ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం కూడా చేశాయి. పైగా హంగ్, అవిశ్వాస తీర్మానం నెగ్గడం వంటి ఏ కారణంతో అయినా గడువుకు ముందే చట్టసభ రద్దయితే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త సభ ఐదేళ్లు కాకుండా రద్దయిన సభలో మిగిలిన కాలావధి పాటు మాత్రమే కొనసాగాలని కోవింద్‌ కమిటీ సూచించింది. అలాగైతే జమిలి ప్రక్రియకు భంగం కలగకుండా ఉంటుందని పేర్కొంది. కానీ దీనిపైనా పలు పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ప్రజాతీర్పు కోరి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు కొనసాగరాదనడం అప్రజాస్వామికమని, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధమని వాదిస్తున్నాయి.   

#Tags