Indian Railways: రైల్వే టికెట్ అడ్వాన్స్ బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పు
ప్రస్తుతం నాలుగు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. దీన్ని 60 రోజులకు కుదించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ కాల పరిమితిని 60 రోజులకు తగ్గిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకు ముందు అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి 120 రోజులు కాగా, ఇప్పుడు అది 60 రోజులకు తగ్గింది.
ఈ నిర్ణయం నవంబర్ 1వ తేదీ నుంచి బుక్ చేసుకొనే టికెట్లపై అమలుకానుంది. ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా రైల్వే టికెట్ కౌంటర్ నుంచి టికెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి షార్ట్ రూట్ రైళ్లకు ఈ నిర్ణయం వర్తించదని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో విదేశీ పర్యాటకులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
MSP Rate Hike: ఆరు పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం
Tags
- IRCTC
- IRCTC Booking
- Indian Railway
- Rail Tickets
- Ministry of Railways
- railway ministry
- advance reservation period
- Advance Ticket Booking
- Train Ticket Booking
- Train Tickets
- Sakshi Education Updates
- advance booking
- train ticket reservation
- reservation policy update
- railway notification
- November 1 changes
- travel booking
- sakshieducation latest news