Draupadi Murmu: మలావీ అధ్యక్షుడితో భేటీ అయిన ద్రౌపదీ ముర్ము
Sakshi Education
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్జీరియా, మౌరిటానియా, మలావిలలో పర్యటించారు.
భారత రాష్ట్రపతి ఒకేసారి మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. అక్టోబర్ 13 నుంచి 19వ తేదీ వరకు మూడు దేశాల పర్యటనలో ఉన్న ముర్ము చివరిగా మలావీకి చేరుకున్నారు.
మలావీ అధ్యక్షుడు లాజరస్ మెక్‌కార్థీ చక్వేరాతో ద్రౌపదీ ముర్ము, లిలోంగ్వె నగరంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో, వ్యవసాయం, గనుల తవ్వకం, పర్యాటకం, ఇంధనం వంటి అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి చర్చించారు.
సంస్కృతి, క్రీడలు, ఔషధ రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొన్ని కీలక ఒప్పందాలను ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
భారత్, మలావీకి మానవతా సహాయంగా 1000 మెట్రిక్ టన్నుల బియ్యం, ఒక క్యాన్సర్ చికిత్సా యంత్రాన్ని అందజేసింది.
BRICS Summit: 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ.. ఈ సమ్మిట్ థీమ్ ఇదే..
Published date : 21 Oct 2024 10:34AM