Parliamentary Committee Members : పార్లమెంటరీ కమిటీల నియామకం.. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా..

అత్యంత కీలకమైన ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌ గా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ నియమితులయ్యారు. లోక్‌ సభ సభ్యులు 15 మంది, రాజ్యసభ సభ్యులు ఏడు గురితో కూడిన ఈ కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తారు. అంచనాల కమిటీకి డాక్టర్‌ సంజయ్‌ జైస్వాల్, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి బైజయంత్‌ పాండా కమిటీకి డాక్టర్‌ ఫగ్గాన్‌ సింగ్‌ కులాస్తే, ఓబీసీలపై కమిటీకి గణేష్‌ సింగ్‌ లను లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా నియమించారు. 

Rashtriya Vigyan Puraskar : రాష్ట్ర‌ప‌తి చేత‌ రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌ – 2024

ఆర్థిక సంబంధాలకు సంబంధించి పీఏసీ, అంచనాలు, ప్రభుత్వ సంస్థల కమిటీలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ప్ర‌భుత్వం చేస్తున్న ఖర్చులు, ప్రభుత్వరంగ సంస్థల సమర్థ నిర్వహణ వ్యవహారాలను ఈ కమిటీలు అధ్యయనం చేస్తాయి. ఎస్సీఎస్టీల సంక్షేమ కమిటీకి బీజేపీ నేత ఫగాన్‌ సింగ్‌ కులస్తే చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అంచనా కమిటీకి బీజేపీ నేత సంజయ్‌ జైశ్వాల్, ప్రభుత్వ సంస్థల కమిటీకి చైర్మన్‌గా బీజేపీ నేత బైజయంతీ పాండాను నియమించారు. 

#Tags