Skip to main content

Musi River: ప్రపంచ విషపూరిత నదుల్లో 23వ స్థానంలో ఉన్న‌ మూసీ

ప్రపంచ విషపూరిత నదుల్లో హైదరాబాద్‌లోని మూసీ 23వ స్థానంలో ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
World Dangerous Musi River In Hyderabad

మూసీ చుట్టుపక్కల ఉన్న బోర్‌ వాటర్‌ కూడా కలుషితమైందని, అందుకే దాని పక్కన ఉన్న ప్రజలను తరలించాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. సెప్టెంబ‌ర్ 30వ తేదీ గాందీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ పక్కన ఉంటున్న వాళ్ల శరీరంలో హెవీ మెటల్స్‌ ఉన్నట్లు తేలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మూసీ పక్కన తాను నివాసం ఉన్నానని, ఆ బాధలు ఏంటో తనకు తెలుసునని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వడం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. మూసీ, హైడ్రాపై కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ చేయలేని పనిని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారన్నారు. కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ కట్టుకొని హాయిగా ఉండొచ్చునని, ఇటలీ నుంచి వచ్చే నీళ్లు కేటీఆర్‌ తాగుతున్నాడని ఆరోపించారు.  

Three Gorges Dam: భూ గమనాన్ని ప్రభావితం చేస్తున్న 'త్రీ గోర్జెస్‌ డ్యామ్‌'

Published date : 01 Oct 2024 03:33PM

Photo Stories