Prostate Cancer: భారత్‌లో పెరుగుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు
డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు ప్రొస్టేట్ క్యాన్సర్ భారతదేశంలో పురుషులకు ప్రాణాంతకంగా మారుతున్నట్లు సూచిస్తున్నాయి. సెప్టెంబర్‌ను ప్రొస్టేట్ క్యాన్సర్ అవగాహనా నెలగా జరుపుకున్నారు. 50 ఏళ్లలోపు వ్యక్తులలో ఈ క్యాన్సర్ బారిన పడే పరిణామాలు పెరుగుతున్నాయని డబ్ల్యూహ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వృద్ధుల కంటే యువతకు..
సాధారణంగా వృద్ధులలో కనిపించే ఈ వ్యాధి, ప్రస్తుతం 35-44 ఏళ్ల మధ్య వయస్కులను కూడా ప్రభావితం చేస్తోంది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఈ సమస్య మరింతగా తీవ్రమవుతోందని నిపుణులు చెబుతున్నారు.
2022లో భారత్‌లో 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి, అందులో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు 37,948 (3%) ఉన్నాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఇవే..
మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది, రాత్రి పదే పదే లేవాల్సి రావడం, మూత్రంలో రక్తం, నడుము లేదా జననాంగం వద్ద తీవ్ర నొప్పి
దీనిని తగ్గించడానికి.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, శారీరక వ్యాయామం చేసుకోవాలి. సక్రమ జీవనశైలిని అనుసరించాలి.
Unemployment Stats: భారత్‌లో అత్యధిక/అత్యల్ప నిరుద్యోగిత రేటు ఉన్న టాప్ 10 రాష్ట్రాలు ఇవే..