LPG Price Hike: పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
19 కిలోల గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.48.50 నుంచి రూ.50కి పెరిగింది.
ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలో కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రూ.803కే లభ్యం కానుంది.
అక్టోబర్ ఒకటి నుంచి వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర ముంబైలో రూ.1,692.50, కోల్‌కతాలో రూ.1,850.50, చెన్నైలో రూ.1,903కు చేరింది. దీనికి ముందు సెప్టెంబర్‌లో కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధర సుమారు రూ.39 పెరిగి రూ.1,691.50కి చేరింది. దీనికి ముందు రూ.1,652.50గా ఉంది.
కోల్‌కతాలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నుంచి 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.48 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా, రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలలోని ఆహార ధరలు పెరగనున్నాయి.
Prostate Cancer: భారత్‌లో పెరుగుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు