Rashtriya Vigyan Puraskar : రాష్ట్రపతి చేత రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ – 2024
భారత ప్రభుత్వం మొట్టమొదటి అత్యున్నత సైన్స్ పురస్కారాలను అందజేసింది. ప్రఖ్యాత బయోకెమిస్ట్, బెంగుళూరు ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ గోవిందరాజన్ పద్మనాభన్‌ను విజ్ఞాన రత్న అవార్డుతో సత్కరించారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాన్ని ఆగస్టు 22న అందజేశారు.
SC-ST Act: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కులం పేరిట వేధిస్తేనే ఎస్సీ, ఎస్టీ కేసు
13 విజ్ఞాన్ శ్రీ పురస్కార్, 18 విజ్ఞాన్ యువ –శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్‌లు, ఒక విజ్ఞాన్ టీమ్ అవార్డును కూడా రాష్ట్రపతి అందజేశారు. చంద్రయాన్ –3 మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందానికి విజ్ఞాన్ టీమ్ అవార్డు దక్కింది. ప్రాజెక్టు డైరెక్టర్ పీ వీరముత్తువేల్ ఆ అవార్డును అందుకున్నారు. అవార్డు గ్రహీతలందరికీ ఓ మెడల్‌తో పాటు ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు.
Tags
- Rashtriya Vigyan Puraskar
- President Droupadi Murmu
- Indian Government
- science awards
- Vignan Ratna
- republic hall
- Rashtrapati Bhavan
- August 22
- Current Affairs National
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- GovindarajanPadmanabhan
- VigyanRatnaAward
- IndianInstituteOfScience
- GovernmentofIndia
- AwardCeremony