Jagananna Videshi Vidya deevena: జ‌గ‌న‌న్న విదేశీ విద్యాదీవ‌న ప‌థ‌కం పూర్తి వివ‌రాలు ఇవే... చివ‌రి తేదీ మే 31... ఇలా అప్లై చేసుకోండి

రాష్ట్రంలోని పేద వర్గాలకు చెందిన పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’కు దరఖాస్తు గ‌డువు స‌మీపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో ప్రకటించిన ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మే నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం ఇస్తోంది.
jagananna-videshi-vidya-deevena

అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ విదేశీ విద్య అందాలనే లక్ష్యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు విదేశాల్లో చదువుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్‌ ర్యాంకులు కలిగిన వర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తుంది. ఒకటి నుంచి వంద క్యూఎస్‌ ర్యాంకింగ్‌ కలిగిన వర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు రూ.కోటి అయినా నూరు శాతం ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది.

అలాగే క్యూఎస్‌ ర్యాంకుల్లో 101 నుంచి 200 లోపు కలిగిన వర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే.. రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసేలా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రూపొందించారు.

చ‌ద‌వండి: వ‌స‌తిదీవెన కింద 912 కోట్ల విడుద‌ల‌... ఇప్ప‌టివ‌ర‌కు 14,200 కోట్లు అంద‌జేసిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌

ఈ పథకానికి వార్షిక ఆదాయం రూ.8 లక్షల వరకు ప్ర‌భుత్వం పెంచింది. అర్హులందరికీ ప్రభుత్వం పూర్తి రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుంది. అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అనంత‌రం అధికారులు వాటిని ప‌రిశీలించి, అర్హుల‌ను ఎంపిక చేస్తారు. నిబంధనల మేర‌కు ఉన్న‌ ధరఖాస్తులను ఆమోదిస్తారు. ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందిన ప్ర‌తీ అభ్య‌ర్థికి ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి చేకూరుతుంది.

వీరే అర్హులు....
1. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ వాసి అయి ఉండాలి.

2. నోటిఫికేషన్ వెలువడే నాటికి గరిష్ట వయస్సు 35 ఏళ్లు మించకూడదు.

3. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.

4. ప్రతి కుటుంబానికి ఒక అభ్యర్థి మాత్రమే అర్హులు.

5. రాష్ట్రాలు లేదా భారత ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకాల కింద ఆర్థిక సహాయం పొందిన అభ్యర్థి ఈ పథకానికి అర్హులు కాదు.

చ‌ద‌వండి: మెహందీ పెట్టుకున్నా.. నిమిషం ఆల‌స్య‌మైన నో ఎంట్రీ... రేపే పోలీస్ రాత ప‌రీక్ష‌.. 

60 శాతం మార్కులు త‌ప్ప‌నిస‌రి
పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు: ఇంజినీరింగ్/ మేనేజ్మెంట్/ సైన్సెస్/ అగ్రికల్చర్ సైన్సెస్/ మెడిసిన్ అండ్ నర్సింగ్/ సోషల్ సైన్సెస్/ హ్యుమానిటీస్ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

పీహెచ్ డీ కోర్సుకు: ఇంజినీరింగ్ / మేనేజ్ మెంట్ / ప్యూర్ సైన్సెస్ / అగ్రికల్చర్ సైన్సెస్ / మెడిసిన్ / సోషల్ సైన్సెస్ / హ్యుమానిటీస్ లో పీజీ కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత త‌ప్ప‌నిస‌రి.

ఎంబీబీఎస్ కోర్సులకు: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో 60% మార్కులతో ఉత్తీర్ణత.

వివ‌రాల‌కు https://jnanabhumi.apcfss.in/#undefined2 వెబ్‌సైట్ సంద‌ర్శించ‌వ‌చ్చు.

#Tags