Skip to main content

Jagananna Videshi Vidya Deevena Funds: ‘విదేశీ విద్య’ సాయం రూ.2.23 కోట్లు

CM YS Jaganmohan Reddy releasing Jagananna Foreign Education and Jagananna Civil Services incentive funds Jagananna schemes impact  CM Jagan Released Jagananna Videshi Vidya Deevena Funds  CM YS Jaganmohan Reddy releasing Jagananna Foreign Education and Jagananna Civil Services incentive funds

మహారాణిపేట: విద్యార్థుల ఆశయాలకు అనుగుణంగా ఆర్థిక చేయూతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ రెండు పథకాల్లో భాగంగా జిల్లా నుంచి 24 మంది విద్యార్థులు రూ.2,23,23,020 మేర లబ్ధి పొందారు. 2022–23, 2023– 24 సంవత్సరాలకు జగనన్న విదేశీ విద్యాదీవెన, 2023–24 సంవత్సరాలకు జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహాకాలను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.

  • జిల్లాలో 2022–23లో జగనన్న విదేశీ విద్యాదీవెన కింద 12 మంది విద్యార్థులు లబ్ధి పొందగా.. రూ.1.12 కోట్లు, 2023–24లో ఏడుగురికి రూ.1.6 కోట్లు, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం కింద ఐదుగురికి రూ.5 లక్షలు వెరసి 24 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం జిల్లాలోని అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.2,23,23,020 విలువ గల మెగా చెక్కును కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున, సంబంధిత అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం.పోలినాయుడు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు కె.రామారావు, బీసీ సంక్షేమ అధికారి కె.శ్రీదేవి, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

విదేశీ విద్యా దీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి వర్చువల్‌గా జిల్లా నుంచి పాల్గొన్నకలెక్టర్‌ మల్లికార్జున

నాన్న మృతితో చదువు ఆగిపోతుందనుకున్నా..
గాజువాకలోని రాజీవ్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాం. నా తండ్రి మరణించడంతో చదువు మధ్యలోనే ఆగిపోతుందని బాధపడ్డాను. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించడం నాకు వరమైంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. ప్రిలిమ్స్‌ పూర్తయ్యాయి. ఇంకా మెయిన్స్‌ రాయాల్సి ఉంది. ఇటువంటి పథకాన్ని పెట్టి మాలాంటి వారిలో భరోసా నింపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– యు.వంశీవర్మ, ఎంబీబీఎస్‌,గాజువాక
 

Published date : 22 Dec 2023 10:16AM

Photo Stories