Skip to main content

Videshi Vidya Deevena: ఉన్నత చదువుకు ‘విదేశీ విద్యాదీవెన’

పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తోందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ తెలిపారు.

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబ‌ర్ 20(బుధవారం)న‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన గంటేడ సత్య సాయి జగనన్న విదేశీ విద్యాదీవెనకు ఎంపికయ్యాడన్నారు. అమెరికాలోని పర్‌ూడ్య విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందాడని, విద్యార్థికి జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద ప్రభుత్వం రూ.9,65,540 సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం కింద బెల గాంకు చెందిన ఆమిటి హరీష్‌, వీరఘట్టం మండ లం హుస్సేనుపురం గ్రామానికి చెందిన తాడెల కార్తీక్‌కు చెరో లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాన్ని అందజేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయంతో విద్యార్థులు ఉన్నతంగా స్థిరపడా లని సూచించారు. 
కార్యక్రమాన్ని కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌తో పాటు పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీఓలు సి.విష్ణుచరణ్‌, కల్పనాకుమారి, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఎం.డి.గయాజుద్దీన్‌, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి ఎస్‌.కృష్ణ, విద్యార్థులు తిలకించారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేశారు. 

Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన.. దాదాపు కొన్ని వంద‌ల‌ కోట్లు జ‌మ‌..!

ఎంతో ఉపయోగం..
మాది సాధారణ రైతు కుటుంబం. నేను వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సత్యసాయి జీఆర్‌ఈ టెస్టులో ప్రతిభ కనబరచడంతో జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి అర్హుడయ్యాడు. ప్రభుత్వం రూ.9.65 లక్షలు మంజూరు చేసింది. మా లాంటి పేద కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్న జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గతంలో ఈ స్థాయిలో ఏ ప్రభుత్వమూ సాయం చేయలేదు. మా పిల్లలు జీవితాంతం రుణపడి ఉంటారు. – గంటేడ శ్రీరాములనాయుడు, ఉద్దవోలు, గరుగుబిల్లి మండలం

Distribute Tabs: ప్రభుత్వ బడిలో సాంకేతిక విప్లవం.. ఎక్క‌డ‌ అంటే..!  

Published date : 21 Dec 2023 03:56PM

Photo Stories