Skip to main content

APNRTS: విదేశాల్లో చదువుతున్నారా.. అయితే ఉచిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది.
APNRTS: Empowering Expatriates under CM YS Jagan's Guidance  Global Services for Andhra Pradesh Expats by APNRTS  Andhra Pradesh Govt Offers Subsidy For NRTS Insurance Scheme   APNRTS Logo: Serving Andhra Pradesh Expatriates Worldwide

ఇందులో ఒకటి ముఖ్యమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వారు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తీగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం జనవరి 15, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తరువాత బీమా ప్రీమియం పెరిగి, ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోగలరు. (ఇంతకుముందు సంవత్సరానికి రూ.180ల ప్రీమియంగా ఉండేది).

లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ విద్యకు పంపుతున్నారు. అలా వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసా. ఈ మధ్యకాలంలో మనం పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము. విద్యార్థులు సరదాగా బయటకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు వెళ్లినప్పుడు  అనుకోకుండా ప్రమాదాలకు గురవ్వడం అత్యంత  బాధాకరం. ఈ బీమా లో నమోదు చేసుకోవడం వలన హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా  ఆసరాగా ఉంటుంది. 

విద్యార్థులు, లేదంటే వారి తరఫున వారి పేరు మీద తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమాలో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి కోరారు.  

Study Abroad Scholarships: స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులకు అందుబాటులో ఉన్న పలు స్కాలర్‌షిప్‌ల వివరాలు ఇవే..

బీమా వలన ముఖ్య ప్రయోజనాలు ఇవే..
► బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా  రూ.10 లక్షల ఆర్థిక సహాయం..
► ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ.1 లక్ష వరకు చెల్లింపు..
► ప్రమాదం/అస్వస్థతకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించిన‌ట్ల‌యితే, స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లింపు.. ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి.

ప్రవాసాంధ్ర భరోసా బీమా నందు నమోదు కొరకు APNRTS 24/7 హెల్ప్‌లైన్‌ 86323 40678, 85000 27678 (వాట్సప్)ను సంప్రదించండి.
వెబ్ సైట్ బీమా పేజ్‌ https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అవ్వండి. లేదా insurance@apnrts.com, helpline@apnrts.comకు ఈమెయిల్ చేయండి.
ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ని సందర్శించండి.

Student Loans: విదేశాల్లో ఉన్నత విద్యకు రుణాలు... 83 శాతం ప్రభుత్వ బ్యాంకుల నుంచే!

Published date : 04 Jan 2024 09:34AM

Photo Stories