Skip to main content

Study Abroad Scholarships: స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులకు అందుబాటులో ఉన్న పలు స్కాలర్‌షిప్‌ల వివరాలు ఇవే..

Scholarships for Academic Excellence   Scholarships for Study Abroad   Details of various scholarships available for Study Abroad students    Scholarships for Top University Admissions
  • ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్న ఉపకార వేతనాలు
  • అకడమిక్‌ రికార్డ్, ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్స్‌

విదేశీ యూనివర్సిటీల్లో చదువుకోవాలని కోరుకుంటున్న విద్యార్థులకు అక్కడి భారీ ఫీజులు, వ్యయాలు ప్రధాన అవరోధంగా మారుతున్నాయి.దీంతో ఎంతోమంది అవకాశాలు వచ్చినా వదులుకుంటున్న పరిస్థితి. ఇలాంటి విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నాయి.. స్కాలర్‌షిప్స్‌! అకడమిక్‌గా అద్భుత ప్రతిభతోపాటు టాప్‌ యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేసుకుంటే.. ఉపకార వేతనాలు ఊతంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో..స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులకు అందుబాటులో ఉన్న పలు స్కాలర్‌షిప్‌ల వివరాలు..

ఫుల్‌బ్రైట్‌ మాస్టర్స్‌ ఫెలోషిప్స్‌
భారతీయ విద్యార్థులు తొలి గమ్యంగా భావించే అమెరికాలో.. ఎలాంటి కోర్సులో చేరాలనుకున్న వారికైనా.. అందుబాటులో ఉన్న ఉపకార వేతనం.. ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్స్‌. ఆర్ట్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/స్టడీస్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ లీగల్‌ స్టడీస్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్‌ హెల్త్, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్, ఉమెన్స్‌ స్టడీస్‌/జండర్‌ స్టడీస్‌ తదితర విభాగాల్లో పీజీ, ఆపై స్థాయి కోర్సుల్లో చేరిన వారు ఈ ఫెలోషిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారికి కోర్సు వ్యవధిలో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళ్లేందుకు విమాన చార్జీలు, నివాస ఖర్చులు, ట్యూషన్‌ ఫీజు ఫండింగ్‌ వంటివి లభిస్తాయి. 
వివరాలకు వెబ్‌సైట్‌: https://www.usief.org.in/Fulbright-Nehru-Fellowships.aspx

చదవండి: US Student Visa New Rules: దరఖాస్తులో ఈ కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే... వీసా ఫీ కూడా వెనక్కి రాదు!!


క్వాడ్‌ ఫెలోషిప్‌ ఫర్‌ స్టెమ్‌ కోర్సెస్‌
క్వాడ్‌ దేశాల కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటైన స్కాలర్‌షిప్‌ ఇది. క్వాడ్‌ గ్రూప్‌లోని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాకు చెందిన వంద మంది విద్యార్థులకు అమెరికాలోని యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్స్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ పీజీ, డాక్టోరల్‌ కోర్సుల్లో చేరే వారికి ఈ ఫెలోషిప్‌ను అందిస్తారు. దీనికి ఎంపికైన వారికి రూ.50 వేల డాలర్ల ఏక మొత్తం ఆర్థిక సహాయం అందిస్తారు. నీడ్‌ బేస్డ్‌ విధానంలో కోర్సు పూర్తి చేసుకునేందుకు అయ్యే వ్యయంలో భాగంగా మరో 25 వేల డాలర్లు ఇస్తారు. దీనికోసం అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలకు వెబ్‌సైట్‌: https://www.quadfellowship.org/

నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ ఎస్సీ క్యాండిడేట్స్‌
దేశంలో ఎస్సీ కేటగిరీలకు చెందిన అల్పాదాయ వర్గాల విద్యార్థులకు  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం..నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌. ఎస్సీ/ఎస్టీ, వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు, డినోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార జాతులు, సంపద్రాయ కళాకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం రూ.8లక్షల లోపు ఉండాలి. డిగ్రీ లేదా పీజీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, విదేశాల్లో పీజీ లేదా పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుని ఉండాలి. మొత్తం 125 స్కాలర్‌షిప్‌ అందుబాటులో ఉన్నా యి. ఇందులో ఎస్సీ కులాల వారికి–115, సంచార, పాక్షిక సంచార జాతుల వారికి–06, భూమిలేని వ్యవసాయ కూలీలకు, సంప్రదాయ కళాకారులకు–04 స్కాలర్‌షిప్స్‌ను కేటాయిస్తారు. పీజీ కోర్సులో చేరితే మూడేళ్ల పాటు, పీహెచ్‌డీ చేస్తే నాలుగేళ్లు స్కాలర్‌షిప్స్‌ను మంజూరు చేస్తారు. ట్యూషన్‌ ఫీజు, మెయింటనెన్స్‌ అలవెన్స్, అత్యవసర ఖర్చులు, వీసా ఫీజు, ఎక్విప్‌మెంట్‌ అలవెన్స్, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తదితర ఖర్చుల కోసం ఈ స్కాలర్‌షిప్‌ కింద ఆర్థిక సహకారం అందిస్తారు.
వెబ్‌సైట్‌: https://nosmsje.gov.in/

చదవండి: Student Loans: విదేశాల్లో ఉన్నత విద్యకు రుణాలు... 83 శాతం ప్రభుత్వ బ్యాంకుల నుంచే!

ఏడీబీ–జపాన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌
జపాన్‌లోని యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న మన దేశ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రముఖ స్కాలర్‌షిప్‌ పథకం.. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ జపాన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌. ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి సంబంధిత విభాగాల్లో ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఇవి లభిస్తాయి.ఎంపికైన వారికి పూర్తి స్థాయి ట్యూషన్‌ ఫీజు, హౌసింగ్‌ అలవెన్స్, బుక్స్‌ అలవెన్స్, ట్రావెల్‌ ఎక్స్‌పెన్సెస్‌ అందుతాయి. అభ్యర్థులు తాము ప్రవేశం ఖరారు చేసుకున్న యూనివర్సిటీలో అడ్మిషన్‌ తేదీ ప్రారంభానికి కనీసం ఆరు నెలల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలకు వెబ్‌సైట్‌: https://www.adb.org/

Published date : 30 Dec 2023 10:52AM

Photo Stories