Student Loans: విదేశాల్లో ఉన్నత విద్యకు రుణాలు... 83 శాతం ప్రభుత్వ బ్యాంకుల నుంచే!
Sakshi Education
చిలకలపూడి(మచిలీపట్నం): పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ద్వారా విద్యార్థులకు ఇచ్చిన విద్యా రుణాల గురించి తెలియజేయాలని బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి డిసెంబర్ 4న పార్లమెంట్‌లో ప్రశ్నించారు.
90 శాతం విద్యారుణాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఇవ్వటం నిజమా, కాదా తెలియజేయాలన్నారు. ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు అందుకున్న విద్యా రుణ దరఖాస్తుల వివరాలు సంవత్సరాల వారీగా తెలియజేయాలని కోరారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు 83 శాతం రుణాలు ఇచ్చాయని సమాధానమిచ్చారు.
Published date : 06 Dec 2023 11:24AM