Skip to main content

Education System: విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు

ఏర్పేడు : విద్యా విధానంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని వైఎస్సార్‌సీపీ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు మద్దిల ముని శారద తెలిపారు.
Revolutionary changes in education system  YSRCP Teachers Federation Appreciates CM's Initiatives

జ‌నవ‌రి 28న‌ ఏర్పేడు శివ పబ్లిక్‌ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో వైఎస్సార్‌ సీపీ మేధావుల ఫోరమ్‌ జిల్లా అధ్యక్షుడు కాపిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేటి బడి–మార్పుల బడి అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా నేటి బడి–మార్పుల బడి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్‌ను ఉజ్వలంగా తీర్చిదిద్దడం ద్వారా ప్రభుత్వం సమ సమాజనిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని పేద విద్యార్థులకు అందించేందుకు డిజిటల్‌ విద్యను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ పాఠ్యాంశాలతో ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించారని వెల్లడించారు.

చదవండి: Free Training: కంప్యూటర్‌ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, గోరుముద్ద పథకాల ద్వారా పేద విద్యార్థులకు అండగా జగనన్న నిలుస్తున్నారని వివరించారు. మరింత అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కో–ఆప్షన్‌ సభ్యుడు బత్తిశెట్టి, ఉపాధ్యాయు లు చంద్రశేఖర్‌ రెడ్డి, మహేష్‌, నరేష్‌, జానకిరాము డు, వెంకటముని, సురేష్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Published date : 29 Jan 2024 12:25PM

Photo Stories