Free Training: కంప్యూటర్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
Sakshi Education
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రధానమంత్రి కౌశల్ వి కాస్ యోజన (పీఎంకేవీవై) ఆధ్వర్యంలో కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర కోర్సులపై ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ సూచించారు.
జనవరి 28న జిల్లా కేంద్రంలోని ఎస్టీ పోస్ట్‌మెట్రిక్ వసతి గృహంలో పీఎంకేవీ వై ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
చదవండి: AICTE: కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు బ్రేక్ !.. కారణం ఇదే..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ కంపెనీల ద్వారా ఉద్యోగావకాశాలు పొందేందుకు ఉచిత శిక్షణ దోహదం చేస్తుందని చెప్పారు. పీఎంకేకే అధ్యాపకుడు సురేశ్, వసతిగృహ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Published date : 29 Jan 2024 12:18PM