MBBS Admissions: స్విమ్స్‌లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభం
Sakshi Education
తిరుపతి: స్విమ్స్ శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఆగస్టు 27న ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆరుగురు విద్యార్థులు ప్రవేశం పొందారు.
స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్పీ కుమార్ చేతుల మీదుగా అడ్మిషన్ పత్రాలను అందుకున్నారు. 26వ తేదీ నుంచి ఆల్ ఇండియా కోటా అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, పద్మావతి మహిళా వైద్య కళాశాలకు 26 సీట్లు కేటాయించబడ్డాయని డైరెక్టర్ తెలిపారు.
చదవండి: MBBS Seats In Andhra Pradesh: ఎంబీబీఎస్ సీటుకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన కటాఫ్
న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్ నుంచి విద్యార్థులు ప్రవేశం పొందారు. వైద్య విద్యను క్రమశిక్షణతో అభ్యసించాలని, తల్లిదండ్రులకు, వృత్తికి గౌరవం తెచ్చేలా నడుచుకోవాలని డైరెక్టర్ విద్యార్థులను కోరారు.
Published date : 29 Aug 2024 08:59AM