CM Ys Jagan: వసతిదీవెన కింద 912 కోట్ల విడుదల... ఇప్పటివరకు 14,200 కోట్లు అందజేసిన సీఎం వైఎస్ జగన్
గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు.
వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: మాంసం తినే పులి మారదు.. చంద్రబాబు మారడు: సీఎం జగన్
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 9,55,662 మంది విద్యార్థుల తల్లుత ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేశాం. చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబానికి చెందిన సామాజకి వర్గాన్నే మారుస్తుంది. పేదరికం సంకెళ్లు తెంచుకోవడానికి చదువే అస్త్రం. చదువుల వల్ల ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువు వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం.
వ్యత్యాసాన్ని మీరే గమనించండి
గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను ప్రజలే గమనించాలి. పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. మన ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గింది. ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉన్నత విద్య చదివేవారి సంఖ్య పెరిగింది. గవర్నమెంట్ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.
గత ప్రభుత్వ బకాయిలు చెల్లిస్తున్నాం
ఇది విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న వసతిదీవెన. ఫీజురీయింబర్స్‌మెంట్ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు.. బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. ప్రతి 3 నెలలకు తల్లుల ఖాత్లాలో డబ్బులు జమ చేస్తున్నాం. నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్యా నాదెళ్లతో పోటీపడే పరిస్థితి రావాలి. యువతను ప్రపంచ స్థాయి లీడర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. ఆత్మవిశ్వాసం, కామన్‌సెన్స్‌తో పాటు డిగ్రీ ఉంటే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్.. ఎడ్యూకేషన్ ఈజ్ పవర్.
చదవండి: ఒక అన్నలా జగనన్న నన్ను చదివిస్తున్నాడు.. ఆయన వల్లే నేను బీటెక్ చదువుతున్నా
మొత్తం సాయం రూ.14,223 కోట్లు
సంక్షేమ క్యాలెండర్ అమలు హామీలో భాగంగా పేద విద్యార్థులకు ఆసరా అందిస్తూనే.. గత ప్రభుత్వం 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. గతంలోని టీడీపీ ప్రభుత్వం అరకోరగా ఫీజుల కోసం నిధుల్ని విడుదల చేసేది. పెండింగ్ బకాయిల్ని ఉంచింది. కానీ, అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.