Skip to main content

CM Ys Jagan: ఒక అన్న‌లా జ‌గ‌న‌న్న న‌న్ను చ‌దివిస్తున్నాడు.. ఆయ‌న వ‌ల్లే నేను బీటెక్ చ‌దువుతున్నా.. విద్యార్థిని దీపిక‌

పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువనే అస్త్రంతోనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా.. బుధవారం అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఓ విద్యార్థిని భావోద్వేగానికి గురైంది.

స‌భ‌లో పాల్గొన్న బీటెక్ విద్యార్థిని దీపిక మాట్లాడుతూ... దీపం ఒక గదికి మాత్ర‌మే వెలుగునిస్తుంది. కానీ,  చదువుల దీపం కుటుంబంలోని అంద‌రి జీవితాల్లో వెలుగును నింపి ఆ కుటుంబం రూపు రేఖల్ని మారుస్తుందని సీఎం జగన్‌ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ.. సీఎం జగన్‌తో ముఖాముఖిగా మాట్లాడింది విద్యార్థిని దివ్య దీపిక. ఆమె అనంతపురం జేఎన్టీయూలో బీటెక్‌ సెకండర్‌ ఇయర్‌ చదువుతోంది. ధర్మవరానికి చెందిన దీపిక తండ్రి కొంగాల బాలకృష్ణ టైలర్‌, తల్లి గృహిణి.

చ‌ద‌వండి: నేడే ఇంట‌ర్ ఫ‌స్ట్‌, సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు... ఎన్ని గంట‌ల‌కంటే

విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటున్నా.. వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్‌ చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు. నా కుటుంబం మీద ఏ ఆర్థిక భారం పడకుండా.. నా అన్న లాగే జగనన్న చదవిస్తున్నాడంటూ భావోద్వేగానికి లోనైంది దీపిక. 

చ‌ద‌వండి: మాంసం తినే పులి మార‌దు.. చంద్ర‌బాబు మార‌డు: సీఎం జ‌గ‌న్‌

Published date : 26 Apr 2023 01:56PM

Photo Stories