Skip to main content

Jagananna Videshi Vidya Deevena: పేద విద్యార్థులకు అండగా.. 13 మంది విద్యార్థులకు రూ. 86.93 లక్షల లబ్ధి

Jagananna Videshi Vidya Deevena

ఏలూరు(మెట్రో): జిల్లాలో జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం కింద 13 మంది విద్యార్థులకు రూ. 86.93 లక్షల లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ వె. ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. తాడేపల్లి నుంచి సీఎం జగన్‌ నిర్వహించిన కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌గా వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. 

జిల్లాలో విదేశీ విద్యాదీవెన కింద 11 మంది విద్యార్థులకు రూ. 84,93,077, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం కింద ఇద్దరికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించామన్నారు. ఎస్సీ కేటగిరీలో అల్లాడి జ్యోతిర్మయికు రూ.7.14 లక్షలు, పెనుమాక ఉదయ నందితకు రూ.6 లక్షలు, ఈబీసీ కేటగిరీ కింద కొప్పుల వెంకటహరి చైతన్యకు రూ.2.93 లక్షలు, వడ్లపట్ల కిరణ్‌ నాగసాయికు రూ.4.39 లక్షలు, మద్దిపాటి మనోజ్‌కు రూ.3.88 లక్షలు, బోలి జగదీష్‌కు రూ.13.64 లక్షలు, బీసీ–బీ కేటగిరీ కింద సుంకర ఉదయ్‌కిరణ్‌కు రూ.8.99 లక్షలు, బీసీ–డీ కేటగిరీ కింద తాడిపర్తి శ్రీలక్ష్మీకి రూ.4.08 లక్షలు, జొన్నలగడ్డ నందినికి రూ.4.08 లక్షలు, ఆర్‌.సాయిసాత్విక్‌కు రూ.23.38 లక్షలు, కాపు సామాజిక వర్గానికి చెందిన పన్నూరి రాజీవ్‌కు రూ.6.40 లక్షలు ఆర్థిక ప్రయోజనం చేకూరిందన్నారు. అలాగే ప్రిలిమ్స్‌కు క్వాలిఫై అయిన కొమ్మిని విద్యాశ్రీ, బి.లలిత్‌ సాయి శ్రీరామ్‌కు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం కింద అందించామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జయప్రకాష్‌, ఏలూరు ఆర్డీఓ ఎన్‌ఎస్‌కే ఖాజావలీ, కమిషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ, డీఎంహెచ్‌ఓ శర్మిష్ట, జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఎస్‌.నిర్మలాజ్యోతి పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్య కల సాకారం... 24 మంది లబ్ధిదారులు రూ.2.59 కోట్ల సాయం

Published date : 21 Dec 2023 03:27PM

Photo Stories