Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్య కల సాకారం... 24 మంది లబ్ధిదారులు రూ.2.59 కోట్ల సాయం
నేను విదేశాల్లో చదువుతానని కలలో కూడా అనుకోలేదు. సీఎం జగనన్న అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వల్లే ఆస్ట్రియాలోని ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్ కోర్సు చేస్తున్నాను. ఈ కోర్సుకు మొత్తం ఫీజు రూ.62 లక్షలు. మొదటి విడత రూ.15.53 లక్షలు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా మంజూరయ్యాయి. విదేశీ విద్యను సాకారం చేస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు.
– రవిపూడి శ్రీకాంత్, సాయిపురం,
చదవండి: APPSC Group 1 & 2 Coaching: ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం...
ఉయ్యూరు మండలం
మచిలీపట్నంటౌన్: పేద విద్యార్థుల విదేశీ విద్య కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోందని కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో విదేశీ విద్య దీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకాల్లో లబ్ధిదారులకు బుధవారం ప్రోత్సాహకాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ప్రిలిమ్స్‌కు అర్హత సాధిస్తే లక్ష రూపాయలు, మెయి న్స్‌కు అర్హత సాధిస్తే మరో రూ.50 వేలు అందించేందుకు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకాన్ని సీఎం ప్రారంభించారన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ విద్యా దీవెన రెండో విడత నిధులు విడుదల, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం నూతన పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. కలెక్టరేట్ వీసీ హాలు నుంచి అధికారులతో కలిసి కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. జిల్లాలో జగనన్న విదేశీ విద్య దీవెన పథకం ద్వారా ఈ ఏడాది 18 మంది అర్హులైన విద్యార్థులకు మూడో విడతగా రూ.1.77 కోట్లు, 2023–24 సంవత్సరా నికి ఆరుగురు విద్యార్థులకు రెండో విడత రూ.81.59 లక్షల చొప్పున 24 మందికి రూ.2.59 కోట్లు విడుదల చేస్తూ చెక్కును కలెక్టర్ అందజేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన ఎనిమిది మంది విద్యార్థులకు రూ.8 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర డెప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫణిదూర్జటి, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.