Police Jobs: మెహందీ పెట్టుకున్నా.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ... రేపే పోలీస్ రాత పరీక్ష.. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు ఇవే
అలాగే హాల్ టికెట్‌ను చూపిస్తేనే లోనికి ఎంట్రీ ఉంటుంది. పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు, బ్యాగులను తీసుకురావద్దు. ఐటీ అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
అభ్యర్థులు తప్పకుండా పాటించాల్సినవి ఇవే...
► పోలీస్ నియామకబోర్డు జారీ చేసిన హాల్‌టికెట్, బ్లాక్, బ్లూపెన్, అధార్, డ్రైవింగ్, ఓటర్ గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకురావాలి.
చదవండి: పది, ఐటీఐ అర్హతతో శ్రీహరికోటలో ఉద్యోగాలు.. వేతనం 45 వేలు... ఇలా అప్లై చేసుకోండి
► అభ్యర్థుల గుర్తింపును పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతిస్తారు.
► పరీక్ష ప్రారంభమైన తరువాత అభ్యర్థులను హాల్‌లోకి అనుమతించరు. లోపల ఉన్న వారిని పరీక్ష పూర్తయ్యేవరకు బయటకు పంపించరు.
► అభ్యర్థులు గంట ముందుగా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి.
► పరీక్ష రాసే ముందు అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌ను పూర్తిగా చదువుకోవాలి.
► ఓఎంఆర్‌షీట్‌పై అనవసరపు గుర్తులు, మతపరమైన గుర్తులు, ఏమైనా రాస్తే ఆ ఓఎంఆర్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోరు.
► అభ్యర్థులు అనైతిక చర్యలకు పాల్పడితే.. వారి ఓఎంఆర్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోరు.
► ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి పరీక్ష రాస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయి.
► అభ్యర్థుల ఫొటోలు, వేలిముద్రలు క్షుణ్నంగా పరిశీలిస్తారు.
► మెహందీ, సిరా వంటి వాటిని చేతులకు, పాదాలకు పెట్టుకోకూడదు.
చదవండి: ఇకపై వాట్సాప్‌లో సచివాలయాల సేవలు... ఏపీలో మరో విప్లవాత్మక నిర్ణయం
► ప్రశ్నపత్రం అభ్యర్థులకనుగుణంగా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది.
ప్రశ్నాపత్రం, కీ సాక్షి ఎడ్యుకేషన్‌లో...
పరీక్ష పూర్తయిన తర్వాత ప్రశ్నపత్రంతో పాటు కీ ని సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. సబ్జెక్ట్ నిపుణులతో కీని సాక్షి అందిస్తుంది. అభ్యర్థులు ప్రాథమిక అవగాహన కోసం కీని చెక్ చేసుకోవచ్చు. అంతిమంగా పోలీస్ బోర్డు విడుదల చేసే కీ మాత్రమే తుది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.