TS Constable Prelims Exam 2022 Primary Key : కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 'కీ' విడుదల.. ఈ సారి 'కీ' లో..
ఈ 'కీ' పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ఆగస్టు 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలోపు తెలియచేయవలెను. ఈ మేరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు.
టీఎస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష 2022 కొశ్చన్ పేపర్ & ‘కీ’ కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ కోటాలోని 15,644, రవాణా శాఖ 63, అబ్కారీ 614 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91.34 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహించారు. మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడిగారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు. వీటిలో ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. 200 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రంలో, తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్ మార్కు ఉంటుంది.
TS SI Preliminary Exam Question Paper With Key (Click Here)
ఈ 'కీ' లో..
ఆగస్టు 28న నిర్వహించిన పోలీస్, రవాణా, అబ్కారీ శాఖ కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రంలో ఎటువంటి తప్పుల్లేవని Telangana Police Recruitment Board స్పష్టం చేసింది. ప్రశ్నపత్రంలో 13 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న వార్తల్ని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కొట్టిపారేశారు.
ప్రాథమిక కీ లో అభ్యంతరాలు వ్యక్తం చేయాలని, ఒకవేళ తప్పు ప్రశ్నలున్నట్లైతే బోర్డు, నిపుణులు వాటిపై చర్యలు తీసుకుంటామని ఆగస్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులెవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రశ్నలు తప్పుగా వచ్చినా, ఒకవేళ సమాధానాల ఆప్షన్లలో తప్పులు దొర్లినా మార్కులు కలిపేందుకు బోర్డు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నిపుణులు, బోర్డు అధికారులు ధ్రువీకరించకముందే వార్తలు ప్రసారం చేసి అభ్యర్థులను ఆందోళనకు గురిచేయవద్దని సూచించారు. కీ పేపర్‌పై అభ్యంతరాలుంటే బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై బోర్డు చర్యలు చేపడుతుందని తెలిపారు.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!