TS Constable Preliminary Exam 2022 : కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షకు హజరయ్యే అభ్యర్థులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
ఈ పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నది. ఈ మేరకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
TS Police Recruitment: ప్రిలిమ్స్ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..
6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు..
ఈ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్ టికెట్లు https://www.tslprb.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. డౌన్‌లోడ్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది ఉంటే support@tslprb.in కు ఈమెయిల్ లేదా 9393711110, 9391005006 నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.
Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్ ఇదే.. ఇలా చదివితే..
కొశ్చన్ పేపర్ & కీ ని..
ఈ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నది. ఈ ప్రిలిమినరీ రాతపరీక్ష పూరైన తర్వాత కొశ్చన్ పేపర్ & కీ ని సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ అందిచనుంది.
Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ జాగ్రత్త పాటించాల్సిందే..
☛ అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి.
☛ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాలి.
☛ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాలి. వేరే దాన్ని అతికించినా, హాల్‌టికెట్ అసమగ్రంగా ఉన్నా పరీక్షకు అనుమతించరు.
☛ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.
☛ పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు.
☛ పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఏదీ ఉండదు.
☛ చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ కేంద్రాల్లోకి అనుమతించరు.
☛ హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
ప్రిలిమినరీ పరీక్ష విధానం..
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు. వీటిలో ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు.