TS Constable Preliminary Exam 2022 : పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఈ తప్పుడు ప్రశ్నలకు మార్కులు !
హైదరాబాద్‌తో పాటు 38 ప్రధాన పట్టణాల్లోని 1601 పరీక్ష కేంద్రాల్లో 6,03,955 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 6,6,1198 మంది అభ్యర్థుల్లో 91.34 శాతం మంది పరీక్ష రాసినట్టు శ్రీనివాసరావు తెలిపారు.
టీఎస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష 2022 కొశ్చన్ పేపర్ & ‘కీ’ కోసం క్లిక్ చేయండి
ప్రశ్నపత్రం 'కీ' పేపర్‌ను త్వరలోనే..
అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సహా ఫొటోలు కూడా నమోదు చేసినట్టు వెల్లడించారు. ప్రశ్నపత్రం 'కీ' పేపర్‌ను త్వరలోనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, ఆ తేదీని కొద్దిరోజుల్లో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓఎంఆర్ షీట్‌పై అభ్యర్థులు ప్రశ్నపత్రం బుక్‌లెట్ కోడ్‌ను తప్పనిసరిగా సరైన విధానంలో వేయాలని, బుక్‌లెట్ కోడ్‌ను రాయకపోయినా, సరైన పద్ధతిలో నమోదు చేయకపోయినా మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు.
TS SI Preliminary Exam Question Paper With Key (Click Here)
వీరికి గుడ్ న్యూస్..
తెలంగాణలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష రాసి అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 28వ తేదీన (ఆదివారం) జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నల్లో తప్పులుదొర్లాయి. ప్రశ్నాపత్రంలో 13 తప్పులు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో బోర్డుకు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తోంది. దీంతో, ఎక్కువ ఫిర్యాదులు వస్తే అభ్యర్థులకు గరిష్టంగా 8 మార్కులు కలిపే అవకాశం అందని నిపుణులు చెబుతున్నారు.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
సబ్ ఇన్పెక్టర్ రాత పరీక్షలో కూడా..
సబ్ ఇన్పెక్టర్ పోస్టులకు ఆగష్టు 7న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. 12న ప్రశ్నాపత్రం ‘కీ’ ని వెబ్‌సైట్‌లో పెట్టారు. ప్రశ్నాపత్రంలో 8 ప్రశ్నలు తొలగించారు. ఇంగ్లీష్- తెలుగు వెర్షన్‌లోని ‘ఎ’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతీ అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు.
TS SI Preliminary Exam 2022 Key : ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ విడుదల.. అర్హత మార్కులు ఇవే..