Skip to main content

TS Constable Preliminary Exam Hall Ticket 2022 : కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌టికెట్లు విడుద‌ల‌.. హాల్‌టికెట్‌పై..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కానిస్టేబుల్‌, తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లల‌ను తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఆగ‌స్టు 17వ తేదీన విడుద‌ల చేశారు.
TS Constable Preliminary Exam Hall Ticket

ఆగ‌స్టు 21వ తేదీన జ‌ర‌గాల్సిన ఈ ప‌రీక్ష‌ను ఆగ‌స్టు 28వ తేదీన నిర్వ‌హింస్తున్న విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలు ఏర్పాటుచేశారు. 6,61,196 మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్షకు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. అభ్యర్థులు ఆగ‌స్టు 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఆగ‌స్టు 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌ టికెట్లు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. డౌన్‌లోడ్‌ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది ఉంటే support@tslprb.in కు ఈమెయిల్‌ లేదా 9393711110, 9391005006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని తెలిపారు.

టీఎస్ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష 2022 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి 

TS Constable Preliminary Exam 2022 Hall Ticket ( Click Here)

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..:
☛ అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి.
☛ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్‌ తీసుకోవాలి.
☛ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్‌ చేసిన ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాలి. వేరే దాన్ని అతికించినా, హాల్‌టికెట్‌ అసమగ్రంగా ఉన్నా పరీక్షకు అనుమతించరు.
☛ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.
☛ పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్‌ వేలిముద్ర తీసుకుంటారు.  
☛ పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఏదీ ఉండదు.
☛ చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలనూ కేంద్రాల్లోకి అనుమతించరు.
☛ హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.

Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!

కానిస్టేబుల్‌–ప్రిలిమినరీ ప‌రీక్ష విధానం..
కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్‌ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు. వీటిలో ఇంగ్లిష్‌ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు.

TS Police Recruitment: ప్రిలిమ్స్‌ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

Published date : 19 Aug 2022 12:53PM
PDF

Photo Stories