AP GST Collections: జీఎస్టీ వసూళ్లలో తెలంగాణను దాటేసిన ఏపీ..!

దేశంలో మరోసారి భారీగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.
Andhra Pradesh overtakes Telangana in Gst Collections

నవంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31%, తెలంగాణలో 18% వృద్ధి నమోదు చేశాయి. కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన నవంబరు నెల లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ వసూళ్లు గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో రూ.3,134 కోట్ల నుంచి రూ.4,093 కోట్లకు పెరిగాయి. 

GST collection in November: నవంబర్‌లో జీఎస్‌టీ వసూళ్ల జోష్‌

ఈ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,67,929 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ వాటా రూ.30,420 కోట్లు, ఎస్‌జీఎస్టీ వాటా రూ.38,226 కోట్లు. ఐజీఎస్టీ రూపంలో రూ.87,009 కోట్ల సమకూరగా.. సెస్సుల రూపంలో రూ.12,274 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది.

గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 15 శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి. రాష్ట్రాల వారీగా రూ.25,585 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో రూ.4,093 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది రూ.3,134 కోట్లతో పోలిస్తే 31 శాతం అధికం. తెలంగాణలో గతేడాది రూ.4,228 కోట్లు వసూళ్లు ఈ సారి 18 శాతం వృద్ధితో రూ.4,986 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి.

India GDP growth Rate: అంచనాలను దాటిన‌ జీడీపీ

#Tags