Skip to main content

GST collection in November: నవంబర్‌లో జీఎస్‌టీ వసూళ్ల జోష్‌

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు నవంబర్‌లో రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
GST collections in November
GST collections in November

గత ఏడాది ఇదే నెలతో (రూ.1.45 లక్షల కోట్లు) పోల్చితే ఈ పరిమాణం 15% అధికం. ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే..

GST collections in October: రికార్డ్‌ స్థాయిలో అక్టోబర్‌ జీఎస్టీ వసూళ్లు

● మొత్తం వసూళ్లు రూ. 1,67,929 కోట్లు
● ఇందులో సీజీఎస్‌టీ వసూళ్లు రూ.30,420 కోట్లు.
● ఎస్‌జీఎస్‌టీ వసూళ్లు రూ.38,226 కోట్లు.
● ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ పరిమాణం రూ. 87,009 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.30,198 కోట్లు కలిపి)
● సెస్‌ రూ.12,274 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.1,036 కోట్లుసహా)

ఆర్థిక సంవత్సరంలో తీరిది...

ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్‌ నెలల్లో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు ఒనగూరాయి. జూలై వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు. ఆగస్టు వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లు కాగా, సెప్టెంబర్‌లో రూ. 1.63 లక్షల కోట్ల జీఎస్‌టీ రాబడి నమోదయ్యింది. ఇక అక్టోబర్‌ విషయానికివస్తే. వసూళ్లు భారీగా రూ.1.72 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో ప్రారంభంతర్వాత ఇవి రెండవ భారీ స్థాయి వసూళ్లు (2023 ఏప్రిల్‌ తర్వాత) కావడం గమనార్హం. 

GST collection rises in September: సెప్టెంబర్‌ జీఎస్టీ వసూళ్ల‌లో భారీ పెరుగుద‌ల‌

Published date : 02 Dec 2023 01:05PM

Photo Stories