Record Breaking Salary: అత్య‌ధిక వేత‌నంతో అద‌ర‌గొట్టిన షాప్ కీప‌ర్ కొడుకు... కోట్ల ప్యాకేజీల‌తో ఆద‌ర్శంగా నిలుస్తున్న కుర్రాళ్లు

ఇప్ప‌టివ‌ర‌కు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం విద్యార్థుల వార్త‌లే చ‌దివాం. దేశ వ్యాప్తంగా ప్ర‌తీ ఏడాది నిర్వ‌హించే క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల‌లో ఈ సంస్థ‌ల విద్యార్థులే అత్య‌ధిక వేత‌నం సాధించేవారు. దీంతో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం లాంటి అత్య‌న్న‌త సంస్థ‌ల్లో సీటు కోసం విప‌రీత‌మైన పోటీ ఉంటోంది.
Record Breaking Salaries

అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితులు కొద్దిగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. దేశంలోని అత్యున్న‌త సంస్థ‌ల నుంచే కాకుండా ఇతర సంస్థ‌ల్లో చ‌దువు పూర్తి చేసిన వారు కూడా రికార్డు స్థాయి ప్యాకేజీలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో కొంత‌మందే మ‌ధుర్ ర‌ఖేజా, ప్ర‌థ‌మ్ ప్ర‌కాశ్ గుప్తా, అభిజిత్ ద్వివేది. 

చ‌ద‌వండి: 6 crore salary package: ఇది క‌దా స‌క్సెస్ అంటే... రోజుకు 1.6 ల‌క్ష‌లు.. ఏడాదికి 6 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన కుర్రాడు

షాప్ కీప‌ర్ కొడుకు... 
హ‌రియాణ‌కు చెందిన మ‌ధుర్ ర‌ఖేజా పేద కుటుంబం నుంచి వ‌చ్చాడు. అత‌డి తండ్రి షాప్ కీపర్‌గా ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి గృహిణి. ఇంట్లోని ప‌రిస్థితుల‌ను చూసి చిన్న‌నాటి నుంచి ర‌ఖేజా చ‌దువుల్లో ముందుండే వాడు. హ‌రియాణ‌లోని అంబాలా కంటోన్మంట్‌లో త‌న విద్యాభ్యాసం పూర్తి చేశాడు. 

➤☛  మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి

డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్ ) లో సీటు రావ‌డంతో 2018లో బీటెక్ జాయిన్ అయ్యాడు. మంచి ప‌ర్సెంటేజీతో సీఎస్ఈ పూర్తి చేశాడు. అక్క‌డే ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్ లో స్పెషలైజేషన్ చేశాడు. అదే ఏడాది నిర్వ‌హించిన క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల‌లో పెద్ద పెద్ద కంపెనీలు మ‌ధుర్ కోసం పోటీ ప‌డ్డాయి. కాగ్నిజెంట్, అమెజాన్, ఫేస్‌బుక్ లాంటి సంస్థ‌లు అత్య‌ధిక వేత‌నం ఆఫ‌ర్ చేశాయి.

➤☛ రెండు కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన హైద‌రాబాదీ అమ్మాయి

చివ‌రికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ను మాధుర్  ఎంచుకున్నాడు. ఏడాదికి రూ.50 లక్షల భారీ వేతనాన్ని మైక్రోసాఫ్ట్ ఆఫ‌ర్ చేసింది. దీంతో ఆ ఊర్లో సందడి నెలకొంది. పేద కుంటుంబం నుంచి వ‌చ్చి క‌ష్ట‌ప‌డి చ‌దివి, అత్యున్న‌త సంస్థ‌లో భారీ ప్యాకేజీ సాధించ‌డంతో మ‌ధుర్ త‌ల్లిదండ్రుల‌తో పాటు ఆ ఊరి వాళ్లు పండుగ చేసుకుంటున్నారు. 

రూ.1.4 కోట్ల ప్యాకేజీతో....
అలహాబాద్‌లోని ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో M.Tech విద్యార్థి ప్రథమ్ ప్రకాశ్ గుప్తా రికార్డ్ బ్రేకింగ్ ప్యాకేజీతో అద‌ర‌గొట్టాడు. గ‌తేడాది అంటే 2022లో నిర్వ‌హించిన క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొన్నాడు. అత‌ని కోసం ప్ర‌ముఖ కంపెనీల‌న్నీ పోటీ ప‌డ్డాయి.

☛ 2 crore job offer : సాధార‌ణ రైతు బిడ్డ‌... రూ.2 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టాడు

అయితే రూ.1.4 కోట్ల ప్యాకేజీని ఆఫర్ చేసి టెక్ దిగ్గజం గూగుల్ ఎగ‌రేసుకుపోయింది. నెలకు రూ .11.6 లక్షల వేత‌నాన్ని ప్ర‌కాశ్ అందుకోనున్నారు. ప్ర‌కాశ్ గుప్తా గూగుల్ లండన్ బ్రాంచ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 2022 ఆగస్టులో అత‌ను విధుల్లో చేరారు.

☛ 88 Lakh salary package: అద‌ర‌గొట్టిన వ‌రంగ‌ల్ నిట్ విద్యార్థి.... 88 ల‌క్ష‌ల ప్యాకేజీతో రికార్డు

అభిజిత్ ద్వివేది రూ.1.2 కోట్ల ప్యాకేజీతో......
లక్నోలోని ఐఐఐటీలో బీటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పూర్తి చేసిన‌ అభిజిత్ ద్వివేది రూ.1.2 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టాడు. ప్రయాగ్ రాజ్ కు చెందిన అభిజిత్ ఐర్లాండ్ లోని డబ్లిన్ లో అమెజాన్ బ్రాంచ్‌లో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.  

చ‌ద‌వండి: 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..

లక్నోలోని ఐఐఐటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స‌మ‌యంలోనే క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్ నిర్వ‌హించారు. అందులో పాల్గొన్న అభిజిత్ రూ.1.2 కోట్ల భారీ ప్యాకేజీని అందుకున్నారు. ఈ ఆఫర్ తో ఐఐఐటీ లక్నో నుంచి గత ఏడాది రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన తొలి విద్యార్థిగా ద్వివేది రికార్డు సృష్టించాడు. ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి అకడమిక్ పరిజ్ఞానంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ దోహదపడ్డాయని అభిజిత్ చెబుతున్నాడు. 

☛ Top 10 Highest paying Govt Jobs: అత్య‌ధిక వేత‌నం ఇచ్చే ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవే

ఐఐఐటీ లక్నోలో లాస్ట్‌ సీజన్ అంటే 2021లో నిర్వ‌హించిన‌ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.26 లక్షలుగా ఉంది. దీన్ని  2022లో నిర్వ‌హించిన‌ క్యాంపస్ ప్లేస్ మెంట్స్ అధిగ‌మించాయి. 2022లో  ఏడాది సగటు వేతనం రూ.40 లక్షలకు పెర‌గ‌డం విశేషం.

#Tags