Free Coaching: పోటీ పరీక్షలకు గౌరీ గ్రంథాలయంలో ఉచిత శిక్షణ
గ్రంథాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఇంట్రాక్టివ్ బోర్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తాజాగా నోటిఫికేషన్లకు శిక్షణ జరుగుతుందన్నారు. శిక్షణలో విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు శిక్షణ, ప్రతి ఆదివారం ఆఫ్‌లైన్‌లో మాక్‌టెస్ట్‌లు జరుగుతాయని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల శిక్షణ పొందలేకపోతున్న గ్రామీణ, పేద విద్యార్థులకు శ్రీధర్ సీసీఈ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ చుక్కానిలా నిలుస్తుందన్నారు. నిరుద్యోగ యువత సంక్షేమం కోసం శ్రీధర్ సీసీఈ ప్రాజెక్టు 24లో భాగంగా అనకాపల్లిలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. గత 28 ఏళ్లుగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తూ ఉపాధికి దోహదపడిన సీసీఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీగౌరీ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్ పంపిణీతో పాటు (కాలేజ్ ఫర్ కాంపిటిటేవ్ ఎగ్జామ్స్) ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తదితర పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా గ్రంథాలయ అధ్యక్షుడు డి.సూర్యనారాయణ, కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు కె.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు కర్రి గంగాధర్, కె.జగ్గారావు, సభ్యులు బొడ్డేడ జగ్గ అప్పారావు, కాండ్రేగుల సత్యనారాయణ పాల్గొన్నారు.
చదవండి: Group 2 Exam Instructions: గ్రూప్-2 పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచనలు, ఇవి అస్సలు మర్చిపోవద్దు