Skip to main content

Bank Employees: బ్యాంకు ఉద్యోగుల వేతనం పెంపు

గత కొంతకాలంగా బ్యాంకు ఉద్యోగులకు వార్షిక వేతనాన్ని పెంచేందుకు చేస్తున్న చర్చ తెలిసిందే. శుక్రవారం, ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం వెల్లడించారు.
 Bank Staff to Enjoy 17% Salary Increase   Decision for increase in salary of bank employees   Good News for Bank Workers

సాక్షి ఎడ్యుకేషన్‌: బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం పెంచాలని కొద్దిరోజులుగా ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ)తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి శుక్రవారం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం వెలువడింది. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది.

Welfare of Employees: మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత

తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా రూ.12,449 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు తెలిసింది. ఈ వేతన పెంపు 2022 నవంబరు నుంచి అమలుకానుంది. దీంతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేసేలా, అన్ని శనివారాలను సెలవుగా గుర్తించడానికి ఆలిండియా బ్యాంక్స్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఒప్పుకుంది. ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్‌ తర్వాత సవరించిన పనిగంటలు అమల్లోకి వస్తాయి. 

APPSC Notification: గుడ్‌న్యూస్‌.. ఏపీలో నాలుగు ప్ర‌భుత్వ‌ ఉద్యోగ నోటిఫికేషన్లు

కొత్త డీఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు. దీని ప్రకారం.. మహిళా ఉద్యోగులు మెడికల్‌ సర్టిఫికేట్‌ సమర్పించకుండానే నెలకు ఒక సిక్‌ లీవ్‌ తీసుకునే సౌలభ్యం ఉంది. ఉద్యోగి రిటైర్‌మెంట్‌ సమయంలో 255 రోజుల వరకు ప్రివిలేజ్డ్‌ లీవ్‌లను నగదుగా మార్చుకోవచ్చు. విధుల్లో మరణించినా, ఈ మొత్తం సంబంధీకులకు చెల్లిస్తారు.

Employees DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. 4 శాతం డీఏ పెంపు

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పెన్షన్‌/ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు నెలవారీ ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. 2022 అక్టోబరు 31న, అంతకుముందు పెన్షన్‌ అందుకునేందుకు అర్హత ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.

Department of Health: కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇక రెగ్యులర్‌

Published date : 09 Mar 2024 11:59AM

Photo Stories