Welfare of Employees: మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత
పుట్టపర్తి రూరల్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, రమణారెడ్డి ఆధ్వర్యంలో విద్యా సదస్సు, మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రా రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు.
APPSC Notification: గుడ్‌న్యూస్.. ఏపీలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు
కల్పలతా రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతానికి పైగా ప్రాధాన్యత దక్కుతోందన్నారు. పార్లమెంట్‌లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభిస్తే.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడ మహిళలకు అంతకుముందే మంచి అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్ కేర్ లీవ్‌లను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచారన్నారు.
AI Mission: కేంద్రం కీలక నిర్ణయం.. ఏఐ కోసం రూ.వేల కోట్లు!!
వాటిని పిల్లల వయసు 18 ఏళ్లలోపు వాడుకోవాలన్న నిబంధనను తొలగించేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. ప్రతి మహిళా దినోత్సవానికి మహిళా ఉద్యోగులకు ఓ వరం ప్రకటించారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కట్టుబడి ఉన్నారని పునరుద్ఘాటించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు తప్పక పరిష్కరిస్తారన్నారు.
Department of Health: కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక రెగ్యులర్
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రా రెడ్డి అన్నారు. విద్య కోసం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా ఏపీలో రూ.71 వేల కోట్లు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారన్నారు. రాజకీయ లబ్ధి ఆలోచించకుండా, ఓటర్లు కాకపోయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం జగన్ చేస్తున్న కృషి ఆదర్శప్రాయమన్నారు.
Women Empowerment: విద్య, ఆర్థిక స్వేచ్ఛతోనే మహిళా సాధికారత
కరోనా సమయంలోనూ అండగా ఉన్నారు
కరోనా విపత్కర సమయంలోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అండగా సీఎం జగన్ నిలిచారని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి కొనియాడారు. రెవెన్యూ లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సమయంలోనూ ఉద్యోగులకు జీతాలు చెల్లించారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి రెండున్నర లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.
German Inventions: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు ఇవే..
50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, గత డీఎస్సీలకు సంబంధించి 6,800 మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరున్నర లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు సంపూర్ణంగా పరిష్కరించేందుకు రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి అడ్డుపడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే 27 శాతం ఐఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.
Coastal US Cities: ముంపు అంచున అగ్రరాజ్యం.. 24 తీర నగరాలు మునిగిపోయే ప్రమాదం!!
మరోసారి ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బోయ శాంతమ్మ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వందలాదిమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.