Skip to main content

Coastal US Cities: ముంపు అంచున అగ్రరాజ్యం.. 24 తీర నగరాలు మునిగిపోయే ప్రమాదం!!

అమెరికాలోని 32 తీర నగరాలకు ముంపు ముప్పు పెరిగిందని తాజా అధ్యయనం హెచ్చరించింది.
Coastal US Cities are Sinking as Sea Levels Continue to Rise

వాతావరణ మార్పుల కారణంగా సముద్రమట్టాలు పెరుగుతున్నాయి, ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులను అదుపులోకి తీసుకోకపోతే, అమెరికా తీరప్రాంతాలకు ముంపు ముప్పు పెరిగిపోతుంది.

ప్రధాన అంశాలు..

  • అమెరికాలోని 24 నగరాల్లో సముద్రమట్టం ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది.
  • 12 నగరాల్లో అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి.
  • 50 మందిలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని అధ్యయనం హెచ్చరిస్తుంది.
  • 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది.
  • లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది.
  • అమెరికాలో 109 బిలియన్‌ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని అంచనా.

Indian Population Other Than India: విదేశాల్లో ‘మినీ ఇండియా’.. ఆ దేశాలు ఇవే!!

ముంపు అంచున ఉన్న న‌గ‌రాలు ఇవే.. 

  • బోస్టన్
  • న్యూయార్క్‌ సిటీ
  • జెర్సీ సిటీ
  • అట్లాంటిక్‌ సిటీ
  • వర్జీనియా బీచ్
  • విల్మింగ్టన్
  • మేర్టల్‌ బీచ్
  • చార్లెస్టన్
  • సవన్నా
  • జాక్సన్‌విల్లే
  • మయామీ
  • నేపుల్స్
  • మొబిల్
  • బిలోక్సీ
  • న్యూ ఓర్లీన్స్
  • స్లైడెల్
  • లేక్‌ చార్లెస్
  • పోర్ట్‌ ఆర్ధర్
  • టెక్సాస్‌ సిటీ
  • గాల్వెస్టన్
  • ఫ్రీపోర్ట్
  • కార్పస్‌ క్రిస్టీ
  • రిచ్‌మండ్
  • ఓక్లాండ్
  • శాన్‌ ప్రాన్సిస్కో
  • సౌత్‌ శాన్‌ ప్రాన్సిస్కో
  • ఫాస్టర్‌ సిటీ
  • శాంటాక్రూజ్
  • లాంగ్‌ బీచ్
  • హటింగ్టన్‌ బీచ్
  • న్యూపోర్ట్‌ బీచ్
  • శాండియాగో

Glass Bridge: ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన.. ఎక్కడ ఉందంటే..

Published date : 08 Mar 2024 01:30PM

Photo Stories