Indian Population Other Than India: విదేశాల్లో ‘మినీ ఇండియా’.. ఆ దేశాలు ఇవే!!
మారిషస్, యూకే, యూఏఈ, సింగపూర్‌తో పాటు పలు దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కొన్ని దేశాల్లో ‘మినీ ఇండియా’లు కూడా ఉన్నాయి. ఇక్కడ భారతీయుల ఇళ్లను సులభంగా గుర్తించవచ్చు. అవి ఏఏ దేశాల్లో ఉన్నాయంటే..
మారిషస్..
మారిషస్‌లో 70శాతం జనాభా భారతీయులని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సాంస్కృతికరంగ స్వర్గధామం. ఇక్కడ భారతీయ ఆహార ఖజానా విరివిగా కనిపిస్తుంది. ఇది విదేశాల్లో స్థిరపడాలనుకున్న భారతీయుల ఉత్తమ ఎంపిక అని అంటారు.
యూకే..
భారతదేశం- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. యూకేలో కనిపించే భారతీయ రెస్టారెంట్‌లు, దుకాణాలు దీనికి తార్కాణంగా నిలుస్తాయి. యూకేలో భారత సంస్కృతి కనిపిస్తుంది. యూకేలోని కొన్ని ప్రాంతాలు.. మనం భారత్‌లోనే ఉన్నామా అని అనిపించేలా ఉంటాయి. యూకేలోనూ భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్..
ఎమిరేట్స్‌లో ఎక్కడికి వెళ్లినా భారతీయులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్నట్టేనని చాలామంది అంటుంటారు. యూఏఈ మొత్తం జనాభాలో భారతీయులు 42 శాతం ఉన్నారు.
Glass Bridge: ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన.. ఎక్కడ ఉందంటే..
సౌదీ అరేబియా..
సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 10 శాతం నుంచి 13 శాతం వరకూ భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది.
కెనడా..
మెరుగైన ఉద్యోగావకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తదితర అదనపు ప్రయోజనాలు భారతీయులను కెనడావైపు మళ్లేలా చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం కెనడాలో గణనీయ సంఖ్యలో భారతీయులున్నారు.
ఒమన్..
ఒమన్ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 20 శాతం ఉన్నారు. 2023 నాటికి ఒమన్‌లో దాదాపు తొమ్మది లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఒమన్‌లోని భారతీయులు అక్కడి సాంస్కృతిక వైభవానికి తోడ్పాటునందిస్తున్నారు.
సింగపూర్..
2023లో సింగపూర్‌లో భారతీయుల జనాభా ఏడు లక్షలు. సింగపూర్ ప్రభుత్వం ‘లిటిల్ ఇండియా’ ప్రాంత అభివృద్ధికి చేయూతనందిస్తోంది. సింగపూర్ సాంస్కృతిక వైభవానికి అక్కడి భారతీయులు తోడ్పాటునందిస్తున్నారు.
అమెరికా..
అమెరికాలో అత్యధిక సంఖ్యలో భారతీయులున్నారు. ప్రపంచంలో తమది రెండవ అతిపెద్ద భారతీయ ప్రవాసులు కలిగిన దేశమని యునైటెడ్ స్టేట్స్ పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కెరీర్‌ను మెరుగుపరుచుకోవడంలో పాటు పలు వ్యాపారాలు చేపడుతున్నారు.