Skip to main content

1 Crore Placement Package: విద్యార్థికి ప్లేస్మెంట్‌లో కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం..!

ఈ విద్యాసంస్థలో చదివితే మంచి సంస్థల్లో కొలువు సాధించవచ్చని భావన ఉంది. అదే ఇప్పుడు మళ్ళీ నిజమైంది. అక్కడ చదివిన ఒక విద్యార్థికి కూడా అదే జరిగింది. పూర్తి వివరాలను పరిశీలించండి..
Placement job for student with one crore package

దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) ఒకటి. ఇందులో చదివితే మంచి ప్యాకేజీతో ఉన్నత సంస్థలో కొలువు సాధించవచ్చనే భావన ఉంది. అనుకున్నట్టుగానే తాజాగా ఇందోర్‌ ఐఐఎంలో ఓ విద్యార్థి ఏకంగా రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించారు. 

Mining Staff: మైనింగ్‌ స్టాఫ్‌కు సూటబుల్‌ జాబ్‌

ఐఐఎం ఇందోర్‌లో ఈ-కామర్స్‌ సంస్థలు ఇటీవల నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థి ఈ ఆఫర్‌ను సాధించారు. ఈ ఏడాది చివరి దశ ప్లేస్‌మెంట్లలో ఇదే అత్యధిక ప్యాకేజీ. ఇందుకు సంబంధించిన వివరాలను ఐఐఎం-ఇందోర్ అధికారి పీటీఐతో పంచుకున్నారు.

Best Available School Scheme: బెస్ట్‌ అవలేబుల్‌ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

ఐఐఎం ఇందోర్‌లో నిర్వహించిన చివరి విడుత ప్లేస్‌మెంట్స్‌లో 150 కంపెనీలు 594 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయి. ఈ ఇంటర్వ్యూల్లో రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.

Course and Job Offer: సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కోర్సులతో ఉద్యోగావకాశాలు.. శిక్షణకు తేదీ..!

ప్లేస్‌మెంట్‌ పొందిన విద్యార్థులకు లభించిన ఆఫర్ సగటున రూ.25.68 లక్షల వేతనం అని ఐఐటీ ఇండోర్ తెలిపింది. గరిష్ఠంగా ఓ విద్యార్థికి ఏకంగా ఏటా రూ.కోటి వార్షిక వేతనంతో ఆఫర్‌ వచ్చిందని చెప్పింది.  సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగంలో ఈ విద్యార్థికి ఉద్యోగం లభించినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 

Internship Opportunity: స్టైపండ్‌తో ఇంటర్నషిప్‌ అవకాశం.. సంస్థలతో ఒప్పందం..!

ప్రస్తుతం ఉద్యోగాల మార్కెట్లో సవాళ్లు ఎదురవుతున్నా ఐఐఎం ఇందోర్ తన పేరు నిలుపుకోవడంతోపాటు అతిపెద్ద కంపెనీలను ఆకర్షించగలిగింది. ఈ ఏడాది కొత్తగా 50కి పైగా కంపెనీలు తమ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహించాయని ఐఐఎం ఇందోర్ డైరెక్టర్ హిమాంశురాయ్ తెలిపారు.

Published date : 14 Feb 2024 04:28PM

Photo Stories