Skip to main content

Best Available School Scheme: బెస్ట్‌ అవలేబుల్‌ స్కూళ్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

సిరిసిల్లకల్చరల్‌: వచ్చే విద్యాసంవత్సరానికి బెస్ట్‌ అవలేబుల్‌ స్కూళ్ల ఎంపిక కోసం ఆసక్తి గల ప్రైవేట్‌ ఆంగ్ల మాధ్యమ పాఠశాల యాజమాన్యాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి వినోద్‌కుమార్‌ ప్రకటనలో తెలిపారు.
Applications are invited for selection of the best available schools

ఈ ప్రక్రియలో ఎంపికై న పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థికి ట్యూషన్‌ ఫీజు, రెండు జతల యూనిఫామ్స్‌, పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కుల కోసం ఏడాదికి రూ.42వేలు, ఒకటో తరగతి ప్రవేశానికి రూ.28వేలు అందజేస్తామని పేర్కొన్నారు.

చదవండి: Singareni Seva Samiti: నిరుద్యోగ యువతకు సింగరేణి ప్రోత్సాహం

పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులతో పాటు ఐదేళ్లలో 7,10వ తరగతిలో సాధించిన ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుందని, 90 శాతం ఉత్తీర్ణత, అందులో కనీసం 50శాతం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్సీ సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల వారు ఫిబ్ర‌వ‌రి 20లోపు దరఖాస్తులు అందజేయాలని, మరిన్ని వివరాలకు కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు.

Published date : 14 Feb 2024 03:51PM

Photo Stories