Govt ITIలో 3176 సీట్లు మిగులు
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని మూడు ప్రభుత్వ, 20 ప్రైవేట్ ఐటీఐలకు సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తికాగా, రెండో విడత కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతున్నారు.
మూడు ప్రభుత్వ ఐటీఐల్లో 640 సీట్లు ఉండగా, 270 సీట్లు భర్తీ అయ్యాయి. 370 సీట్లు మిగిలిపోయాయి. 20 ప్రైవేట్ ఐటీ ఐల్లో 3036 సీట్లు ఉండగా, 230 ప్రవేశాలు జరిగాయి. ప్రైవేట్ ఐటీఐల్లో 2806 సీట్లు మిగిలి పోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 3676 సీట్లుకు, మొదటి విడతలో 500 సీట్లు ప్రవేశాలు జరగ్గా, 3176 మిగిలాయి. ఈ నెల 3వ తేదీ నుంచి రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 3వ తేదీన ఎచ్చెర్ల, శ్రీకాకుళం డీఎల్‌టీసీల్లో, 4వ తేదీన పలాన కణితీస్ ప్రభుత్వ ఐటీఐలో, 5, 7 తేదీల్లో ప్రైవేట్ ఐటీఐల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. షెడ్యూల్ మేరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఎచ్చెర్ల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల క న్వీనర్ ఎల్.సుధాకర్‌రావు తెలిపారు.
Also read: AP Open School Society: ఓపెన్ స్కూల్.. బంగారు భవిత
#Tags