AP Open School Society: ఓపెన్ స్కూల్.. బంగారు భవిత
ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. పది పరీక్షలకు హాజ రు కావాలంటే నిర్ణీత ఐదేళ్లలో తొమ్మిదిసార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్ పరీక్షలు రాసే వారు టెన్త్ పాసై రెండేళ్లు వ్యవధి ఉంటే ఐదు సబ్జెక్టులూ ఒకేసారి రాసుకునే అవకాశం ఉంటుంది. రెండేళ్ల వ్యవధి లేకపోతే నాలుగు సబ్జెక్టులు రాసి, రెండేళ్లు పూర్తయిన తర్వాత మిగిలిన ఒక్క సబ్జెక్టూ రాసుకోవచ్చు. అడ్మిషన్ పొందిన అనంతరం ఐదేళ్లలో తొమ్మిదిసార్లు పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందలేకపోతే తిరిగి కొత్తగా అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది.
Also read: UNOలో ప్రసంగానికి ఎంపిక
పదో తరగతిలో చేరేందుకు వచ్చే ఆగస్టు 31వ తేదీ నాటికి 14 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. చదవడం, రాయడం తెలిసి ఉండాలి. దరఖాస్తుతో పా టు టీసీ, రికార్డు షీటు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఇంటర్‌కు 10వ తరగతి మార్కుల జాబితా, టెన్త్‌కు టీసీని దరఖాస్తుతో పాటు అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, దివ్యాంగులు కుల ధ్రువీకరణతో పాటు దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలి.
Also read: ఈ టిప్స్ ఫాలో అయితే Group -1 Mains Essay లో టాప్ స్కోరర్ మీరే #sakshieducation
సబ్జెక్టులు ఇలా ..
పదో తరగతికి గ్రూపు–ఏలో ఇంగ్లిషుతో పాటు తెలుగు/హిందీ/తమిళం/ఒరియా తీసుకోవచ్చు. గ్రూపు–బీలో గణితం, సైన్స్ సోషల్ తీసుకోవాలి. ఇంటర్‌కు గ్రూపు–ఏలో ఇంగ్లిషుతో పాటు తెలుగు/హిందీ/తమిళం/ఒరియా తీసుకోవచ్చు. గ్రూపు–బీలో ప్రధాన సబ్జెక్టుల్లో మూడింటితో కలిపి ఐదు సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. స్టడీ మెటీరియల్ సరఫరా చేస్తారు. ఐదేళ్లలో పూర్తి చేయాలి. ఓపెన్‌న్ స్కూల్‌లో అడ్మిషన్‌్ పొందిన వారికి ప్రతి ఆదివారం, ప్రతి నెలా రెండో శనివారం ఆయా అధ్యయన కేంద్రాల్లో 30 కాంటాక్టు తరగతులు నిర్వహిస్తారు. కనీసం 20 కాంటాక్టు తరగతులకు హాజరైన వారిని మాత్రమే మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించే పరీక్షలకు అనుమతిస్తారు.
Also read: Parental Influence: How Parents Impact the Future of Their Children #sakshieducation
రెగ్యులర్ విద్యార్థులకూ సదావకాశం
రెగ్యులర్ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ చదివి ఉత్తీర్ణులు కాలేకపోతున్న వారు కూడా సార్వత్రిక పాఠశాలలో చేరి, సులభంగా ఉండే సబ్జెక్టులు ఎంపిక చేసుకుని పాసయ్యే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ పదో తరగతి, ఇంటర్ ఫెయిలైనప్పటి నుంచి ఐదేళ్ల లోపు సార్వత్రిక పాఠశాలలో చేరితే.. రెగ్యులర్‌గా పాసైన సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టుల మార్కులను బదలాయించుకునే వీలుంటుంది. పదిలో హిందీ మార్కులను మాత్రం బదలాయించరు. ఇలా బదలాయించుకున్న వారు మిగిలిన మూడు సబ్జెక్టుల పరీక్షలు రాస్తే సరిపోతుంది.
Also read: విద్యార్థుల ఆత్మహత్యకు.. తల్లిదండ్రుల ఒత్తిడి కారణమా..? |